పుస్తకం మనిషి చిన్నతనం నుండి పెద్ద వయస్సుదాకా ప్రతి మనిషికీ తోడుండే ఒక మంచి నేస్తం,
మనకి తెలియని ఎన్నో విషయాల్ని నేర్పించే ఒక మంచి గురువు,
ప్రయాణాల్లో,ఏమీ తోచనప్పుడు మంచి కాలక్షేపం,
నాకు కూడా ఇష్టమైన హాబీ మంచి పుస్తకాలు చదవటం..
నెల నెల వెన్నెల ఎమెస్కో నవల అంటూ మా అమ్మ ప్రతి నెల ఇంటికి తెప్పించే బుక్స్ తో పాటు,
నేను,తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా కొనుక్కువచ్చే బుక్స్ తో మా ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ వుంది...
ఇంకా సేకరించాల్సిన పుస్తకాలు చాలానే వున్నాయి...
మా అమ్మ లైబ్రరీ.యద్దనపూడి & యండమూరి ఇంకా కొందరు రచయితల నవల్స్.