"ఒక మనిషిని బంధించి,బానిసగా చేసుకుని,వాళ్ళఆలోచనలతో,అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా మన అభిరుచులకి అనుగుణంగా నడవమన్నప్పుడు ఆ మనిషి నిజంగా స్వేచ్చాజీవి ఐతే మనల్ని ప్రేమించరు, ద్వేషిస్తారు..!! ఎదుటి మనిషి చుట్టూ స్వార్ధమనే సంకెళ్ళను బిగిస్తే అది బంధం కాదు బంధనం అవుతుంది...
ప్రతి మనిషి జీవితంలో బంధాలు .. అనుబంధాలు ఎన్నో ఉంటాయి."మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ" అన్నది అక్షర సత్యం. మనిషికి ఎన్నో బంధాలు ఉంటాయి..ఇందులో ఎవరూ ఎక్కువా కాదు .. ఎవరూ తక్కువ కాదు ఎవరి స్థానం వారిదే.. ఇలాంటి రిలేషన్స్ గురించి నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్.." వివేకానంద "