సృష్టిలో మనం మాత్రమే విశిష్టమైన,విలక్షణమైన వాళ్ళమని మానవుల నమ్మకం.ఆలోచనలు,అభిప్రాయాలు,కోరికలు,ఆశలు,ప్రేమలు,కోపాలు,
అలకలు ఇలాంటి ఫీలింగ్స్ అన్ని మనవే అనుకుంటాము ..
అమ్మ ప్రేమ మనకి మాత్రమే సొంతం .. అమ్మని మనం మాత్రమే ప్రేమిస్తాం అనుకుంటాం. కానీ అమ్మప్రేమ జంతువుల్లో కూడా ఉంటుంది .. క్రూర మృగాలు కూడా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి .. అమ్మ అందరికీ అమ్మే అన్నమాట ని నిజం చేస్తాయి .. అలాంటి ముచ్చటైన తల్లీ పిల్లల ప్రపంచంలోకి మనమూ వెళ్దామా ..