పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, ఫిబ్రవరి 2011, శనివారం

కొత్తబంగారులోకం..నాకు కావాలి సొంతం


నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్న Junior Civil Judge Exam Notification వచ్చింది.
నేను లా చదివినప్పటినుండి నాకు ప్రాక్టిస్ కంటే ఎక్కువగా Judge కావాలన్నదే కోరిక.
ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను.
నా ప్రయత్నం ఫలించి నా కోరికనెరవేరాలని కోరుకుంటున్నాను..
నా ప్రయత్నంలో నాకు సహకరించటానికి ఆ దేవుడు,నా చిన్నిప్రపంచం, ఎప్పటికీ తోడుగా ఉంటుందన్న నమ్మకంతో ... విజయం సాధిస్తానన్న నమ్మకంతో...




కొరడాదెబ్బ మెల్లగా పడదు...

తప్పు చేసిన పిల్లలను సరైన దారిలో పెట్టే వాళ్ళే పెద్దలు
కానీ దురద్రుష్టవశాత్తు ఇప్పటి సమాజంలో చాలా వరకు పెద్దలు వాళ్ళ పిల్లలు చేసిన తప్పులను కప్పి పుచ్చి ఎదుటి వాళ్ళ పైనే తప్పులను ఆపాదిస్తూ వుంటారు.
ఇవాళ సాక్షి పేపర్ లో ప్రతిరోజూ ఒక కధ పరిచయంలో రంగనాయకమ్మ గారు రాసిన కధ అందరినీ ఆలోచింపచేసేదిగా వుంది.ప్రతి అత్తగారూ ఈ కధలోని మురళీ వాళ్ళమ్మలాగా వుంటే ఏ కోడలికీ మనసును చంపుకుని బ్రతికే అవసరం వుండదు,తమ అబ్బాయి ఎలాంటివాడో అతని తప్పులు ఏమిటో తెలిసి కూడా వాటినే సమర్ధించుకుంటూ మాకొక న్యాయం కోడలికి ఒక న్యాయం అనుకునే ప్రతి అత్తింటి వారు చదవాలసిన కధ ఇది.



మా పింకీ అన్నప్రాసన



నా చిన్నిప్రపంచంలో జరిగిన మరొక సందడి నా మేనకోడలు పింకీ( దేవీ ప్రియ ) అన్నప్రాసన.
మేనత్త మొదటగా అన్నం పెట్టాలి కదా అందుకే ఆవుపాలతో చేసిన పాయసాన్ని నా మేనకోడలికి తినిపించాను.
మొన్నటిదాకా మేము ఏమి తింటున్నా వింతగా అది తను కూడా తినాలని తెగ ఆరాట పడిపోయే మా పింకీ ఇప్పటినుండి తనకి ఇష్టమైనవన్నీ తినటానికి అనుమతి దొరికిందన్నమాట.

Enjoy Your Food పింకీ
దీవెనలతో నా చిన్నిప్రపంచం....

మా చెల్లి నిశ్చితార్ధం ....


ఈ నూతన సంవత్సరంలొ,నా చిన్ని ప్రపంచంలో జరిగిన సంతోషకరమైన సంఘటన నా చిన్నారి చెల్లెలు రమ్య నిశ్చితార్ధం …మా బంధుమిత్రులు,స్నేహితులు ఆహ్వానితుల మధ్య మా రమ్య నిశ్చితార్ధం ఎంతో వైభవంగా, ఆహ్లాదంగా, సంతోషంగా జరిగింది.
నేను,మా తమ్ముడి తర్వాత చాలా గ్యాప్ తర్వాత పుట్టిన మా చిన్ని రమ్య ఇంకా మా కళ్ళకు చిన్నపిల్లలాగానె కనిపిస్తుంది.

I AM A GOOD GIRL అంటూ అందరినీ తన అల్లరితో ముద్దుముద్దుగా విసిగించే మా స్వీటీ పెళ్ళికూతురయ్యింది.
నిశ్చితార్ధం పెళ్లికూతురిగా మా చెల్లిని చూస్తున్న మాకు మేము ఎత్తుకుని మా స్కూల్ కి,మేము ఎక్కడికి వెల్తే అక్కడికి మా వెంట తీసుకుని వెళ్ళి ఆడుకునే రోజులే మాకు గుర్తొస్తున్నాయి…
మా రమ్య కాబోయె శ్రీవారు,మా మరిది గారు,నా చిన్ని ప్రపంచానికి కొత్త సంవత్సరంలో వచ్చిన కొత్త వ్యక్తి…
వీర భద్ర కుమార్ .. .

మా చిన్నారి రమ్య మా అందరికీ ఎంతో గారాబం....తన అలవాట్లు హాబీస్ అన్నీ ఎంతో వెరైటీ..
తన హాబీస్,తన అలవాట్లను ఇష్టపడే వ్యక్తి తనకి భర్తగా రావాలని,మేమందరం ఎలాంటి వ్యక్తి తనకి భర్తగా రావాలి అనుకున్నామో అలాంటి వ్యక్తే తనకి భర్తగా రావటం నిజంగా మా చెల్లి అద్రుష్టం.
మా రమ్య అత్తగారు మా చెల్లి పట్ల చూపించె ప్రేమాభిమానాలు,నా కోడలు అని మా చెల్లిని చూసి సంతోషించడం,వాళ్ళ పెద్దలు మా పెద్దల పట్ల చూపించె గౌరవం ఇవి చాలు మా చెల్లి జీవితం వాళ్ళ కుటుంబంలో సంతోషంగా వుంటుంది అనుకోవడానికి.

అలవాటు లేని చీర కట్టులో మా చెల్లి రమ్య వేదిక ఎక్కడానికి ఇబ్బంది పడుతుందని నేను రెండు సార్లు చేయి పట్టుకుని ఎక్కించాను…మరో సారి కూడా అలాగే నేను తనని పట్టుకోవాలని వెళ్ళేలోపే మా మరిది గారు తన చెయ్యి పట్టుకుని ఒక్క క్షణం లొ వేదిక మీదకి ఎక్కించడం చూసి,ఆ క్షణం లో మాకు  చాలా సంతోషంగా అనిపించింది
ఇదంతా వెనకనుండి చూస్తున్న నాకు, నా తమ్ముడికి అనిపించింది ఇక నుండి మా అవసరం మా చెల్లికి లేదు అని.
మా మరిది గారు మా చెల్లిని అపురూపంగా చూసుకుంటారని…

భార్యని అమితంగా ఇష్టపడి,తన ఇష్టాఇష్టాలను గౌరవించే వ్యక్తి భర్త కావటం ఏ ఆడపిల్లకైనా వరమే కదా..
ఎంతో ఆనందంగా మంచి శుభకార్యం మొదలైన ఈ కొత్త సంవత్సరం నా చిన్నిప్రపంచానికి సకల సుభాలను కలిగించాలని త్వరలోనే మా చెల్లి పెళ్ళి కబుర్లు కూడా చెప్పుకోవాలని కోరుకుంటూ…

ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన రమ్య,భద్ర మీరిద్దరూ ఎప్పటికీ
సుఖసంతోషాలతో ప్రతి అడుగులో ఒకరికి ఒకరు తోడుగా,మీ జీవితమనే పూలతోటలో ఆనందాల పంట పండించుకోవాలని మనసారా దీవిస్త్తూ…
 

మీ మన నా చిన్ని ప్రపంచం…


Related Posts Plugin for WordPress, Blogger...