ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ
ఏ
బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే
చిరుగాలి ప్రేమ
హద్దులేవి లేనిది ... అందమైన ప్రేమ..
ఇది ప్రేమ గురించి ఒక సినీ కవి చెప్పిన అందమైన భావన..
"ఎన్నో బంధాలకి పునాది ప్రేమ"
"ఒకరి కోసం ఒకరుగా బ్రతకటమే ప్రేమ "
"ఒకరి కోసం మరొకరు ఏదైనా చేయటమే ప్రేమ"
ఇలా ప్రేమంటే చాలా మందికి చాలా అభిప్రాయాలు,ఆలోచనలు ఉంటాయి...
కొందరికి ప్రేమంటే కవితలు,కబుర్లు రొమాంటిక్ సర్ ప్రైజెస్, కాస్ట్లీ గిఫ్ట్ లు..
ఇవి కూడా ఒక్కోసారి ఎదుటి మనిషిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో
మన మనసును వ్యక్తం చేయటానికి అవసరమే.. ఇకపోతే ఈ రోజుల్లో ప్రేమికులే కాదు ప్రేమే పునాదిగా వివాహబంధం లోకి వచ్చిన జంటలు కూడా చాలా చిన్నచిన్న కారణాలకే విడిపోవటం, విడాకుల దాకా వెళ్ళటం సర్వసామాన్యంగా మారిపోయింది...
ఈ మధ్య వచ్చిన "మిధునం" సినిమా చూసిన తర్వాత ఎన్నికష్టాలు సమస్యలు ఎదురైనా ఒకరికొకరం అన్నట్లుగా కలిసి బ్రతికిన అప్పటివాళ్ళ లాగా ఇప్పటివాళ్ళం ఆలోచిస్తున్నామా?? నేను గొప్పంటే నేను గొప్ప అనుకునే అహంభావాలు, ఆవేశాలు వదిలేసుకుంటే సమస్యలు తగ్గుతాయి కదా అని. గొప్ప ఆలోచనలు చేయగలము కానీ ఆచరించాలంటే కాస్త కష్టమేనేమో అనిపిస్తుంది :)..
నిన్న ఫేస్ బుక్ లో ఒక వీడియో చూశాను " MEALS READY " అనే టైటిల్ తో చేసిన ఈ వీడియో చూశాక అనిపించింది నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో ... పిల్లలు పెరిగి పెద్దయ్యి ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడినా భార్యా, భర్తా ఒకరికరుగా బ్రతుకుతూ తనని నమ్ముకుని వచ్చిన భార్య కోసం,అవసరమైతే తన పిల్లల కోసం ముసలితనంలో కూడా కష్టపడే ఇలాంటి తండ్రులు కూడా ఉంటారు అని...
మంచి మెసేజ్ తో, చూస్తున్నప్పుడు మనసుకు కొంచెం బాధగా అనిపించిన ఈ వీడియో నాకు చాలా నచ్చింది...
If You Are A Human....
It Will Make Your Eyes Wet.....