చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..
రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా
నాకు మనసుకు నచ్చిన పాటలను
నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.
ఇందులో పాటలన్నీ నాకు చాలా ఇష్టమైన పాటలు.
ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,
నేను చేసిన పాటలు నా ఈ సంగీతప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.