
ఇంద్రధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలూ
నింగీ నేలా ఓ అద్భుతం..నీరు గాలి ఓ అద్భుతం
స్వరాలూ ఏడు సముద్రాలేడు
వెంకన్నవుండే కొండలు ఏడు
పెళ్ళిలో వేసే అడుగులు ఏడు
మనిషి జీవితంలో ఏడు సంఖ్యకి చాలా ప్రాధాన్యం వుంది..
ప్రకృతిలోని అందాలు...మనసుని ఆహ్లాదపరిచే సంగీతం..
కలియుగ దైవం నెలవైన ఏడు కొండలు...జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళిలో వేసే
ఏడు అడుగులు
ఇవన్నీ ఏడు నెంబర్ ని మన జీవితంతో విడదీయలేని అనుబంధాన్ని గురించి తెలియచేస్తుంది..
అలాగే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నగలు..జాతక ప్రభావాన్ని నిర్ణయించే గ్రహాలకి
సంబంధించిన ఏడువారాల నగలకి కూడా ఎంతో ప్రాధాన్యత వుంది..
అప్పట్లో ధనవంతులకి తప్పకుండా ఈ నగలు ఉండేవట.
ఇప్పుడు అందరు జాతకాలు చూపించుకుని అవసరానికి తగినట్లుగా ఈ నగలను చేయించుకుంటున్నారు..
పెద్ద పెద్ద నగలు రోజు పెట్టుకోకపోయినా చిన్న చెవిదిద్దులుగా గా కూడా రోజుకో రత్నం పెట్టుకుంటే మంచిదట...
"ఏడువారాల నగలు"కెంపు 

ముత్యము 
పగడము 

మరకతం
పుష్యరాగము

వజ్రము
నీలం 
