జీ తెలుగు టీవీ లో వచ్చే సోమవారంనుండి రాబోతున్న డైలీ సీరియల్ అర్ధాంగి చాలా బాగుంటుంది.
ఇప్పటికే జీ హిందీ లో "ఆగస్ట్ 14 2006 నుండి మే 2009" వరకు ప్రసారమైన
"Banoo Main Teri Dulhan "సీరియల్ ఇప్పుడు మళ్ళీ జీ తెలుగు లో అర్ధాంగి గా రాబోతుంది..
అప్పట్లో సాయంత్రం 8 గంటలకు వచ్చే ఈ సీరియల్ మొదటి నుండి చివరి దాకా ఒక్క ఎపిసోడ్ కూడా
మిస్ అవ్వకుండా చూసాము.ఎప్పుడైనా మిస్ అయినా నెట్ లో చూసేవాళ్ళము.
అంతగా ఇష్టంగా చూసిన Dulhan సీరియల్ జీ తెలుగు లో అర్ధాంగిగా వస్తుందని
యాడ్ చూసాక మళ్ళీ చూడాలని wait చేస్తున్నాను.
బెనారస్ కు చెందిన అందం,అణకువ, వ్యక్తిత్వంవున్న ఒక పేదింటి అమ్మాయిగా విద్య,
ఠాకూర్ వంశానికి చెందిన "అనుమానాస్పదంగా" జరిగిన ఒక ప్రమాదంలో
గాయపడి.. మానసికంగా ఎదగని అమాయకుడిగా సాగర్ ప్రతాప్ సింగ్,
సీరియల్ లో అతి ముఖ్యమైన పాత్ర, సాగర్ అక్క సింధూరా ప్రతాప్ సింగ్ ల అద్భుతమైన నటనతో...
మంచి కధనంతో ఈ సీరియల్ ఇప్పటికీ ఎప్పటికీ నాకు నచ్చే సీరియల్..
కధ విషయానికి వస్తే ఆస్తి కోసం సవతి తమ్ముడిని పిచ్చివాడిని చేస్తుంది సాగర్ అక్క సింధూరా
తప్పనిసరి పరిస్థితుల్లో అతనిని పెళ్లి చేసుకున్న విద్య సింధూరా నిజ స్వరూపం తెలుసుకుని,భర్తకు పిచ్చి తగ్గించి కాపాడాలని చాలా ప్రయత్నిస్తుంది.ఈ విషయాన్ని సాగర్ కు చెప్పాలని ఎంత అనుకున్నా అక్క గురించి చెడుగా చెప్తుందని భార్యనే తప్పు పడతాడు కానీ అక్కను ఏమీ అనడు ... చివరికి నిజం తెలుసుకున్న సాగర్ ను,విద్యనూ సింధూరా చంపేస్తుంది.సాగర్,విద్యా మళ్ళీ జన్మ ఎత్తి గత జన్మ గురించి తెలుసుకుని సింధూరా ను అంతం చేయటం తో కధ సుఖాంతమవుతుంది.
ఇప్పటికే హిందీ సీరియల్ "ChotiBahu" చిన్నకోడలుగా,
"SaatPhere" అనే సీరియల్ ని కన్యాదానంగా రీమేక్ చేసిన
జీ తెలుగు వారు ఈ Dulhan మాత్రం డబ్బింగ్ చేసి మంచి పని చేశారని నా అభిప్రాయం ఎందుకంటే
రీమేక్ చేసిన ఈ రెండు సీరియల్స్ హిందీ అంత బాగా లేవు...
విద్య -- దివ్యంకా త్రిపాఠి
సాగర్ ప్రతాప్ సింగ్ -- శరద్ మల్హోత్రా
సింధూర -- కామ్య పంజాబీ