స్వార్ధం,ద్వేషం,దురాశ,అహంకారమనే మనిషికి మాత్రమే సొంతమయిన కొన్ని గుణాలకి అతీతుడు సత్య సాయి..
అందుకే సత్యసాయి మనలాగా మనిషే కానీ మనలాంటి మనిషి కాదు.
ఎంతమంది ఎన్ని నిందలు మోపినా బాబా మాత్రం మనిషి రూపంలోని దేవుడు.
ఎందుకంటే నిస్వార్ధంగా సాటి మనిషిని ప్రేమించి, సేవ చేయగలిగే ప్రతి మనిషి దేవుడు కాబట్టి.
తన కోసం ఏమీ ఆశించకుండా...తన సేవల ద్వారా,ప్రభోదాల ద్వారా ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపారు బాబా
ప్రతి మనిషికీ అవసరమైన శారీరక ఆరోగ్యం కోసం వైద్యం,మానసిక వికాసం కోసం విద్య పేదవారికి కూడా అందేలా చేశారు.
ప్రేమ అనే మార్గం ద్వారా సేవ అనే లక్ష్యాన్ని సాధించి,సత్యం,ధర్మం,అహింసలే పరమావధిగా సాగిన బాబా మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయం..
దైవం మానవరూపంలో అవతరించునీ లోకంలో..