
చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఒక వింత ప్రపంచం అనిపిస్తుంది..
గోండ్లు ,సవర,కోయ,చెంచు ఇలా వివిధ ఆటవిక జాతులకి చెందిన అప్పటి ప్రజల జీవిత విశేషాలను,
వారి జీవనాధారాలు,వాళ్ళు నిత్య జీవితంలో ఉపయోగించే పనిముట్లు,వినోద సాధనాలను
అన్నిటినీ కళ్ళకు కట్టినట్లు...చూడగానే నిజమైన మనుషులేమో అనిపించేలా వుండే
ఆటవికుల బొమ్మలు ఇక్కడి ప్రత్యేకత..
ఇక్కడ గిరిజన్ ప్రొడక్ట్స్ కూడా వుంటాయి..ముఖ్యంగా రీతు సోప్స్ చాలా బాగుంటాయి.
ఈ సోప్స్ ఇక్కడే కాకపోయినా బయట మార్కెట్లో అయినా దొరుకుతాయి..కానీ ఎలాగూ వచ్చాము
కదా అని ఇక్కడే తీసుకున్నాము.
ఇక్కడ ఫొటోస్ తీయకూడదు...కానీ తీశాము.
ఇక్కడ వుండే సెక్యూరిటీ అమ్మాయి చాలా సీరియస్ గా ఏవో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుకుంటుంది.
నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది.
అలా చదువులో నిమగ్నమైపోయిన ఆ అమ్మాయి మా వెనక రాకపోవటంతో
మాకు ఫొటోస్ తీయటం కుదిరిందన్నమాట.
అక్కడి బొమ్మలన్నీ నాకు చాలా నచ్చాయి.ముఖ్యంగా బంజారా మహిళలు నృత్యం చేస్తున్న
బొమ్మలు అచ్చం మనుషులే నృత్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది..












