శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - 20 - 10 -2012
ఆశ్వీయుజ పంచమి,షష్టి
ఆశ్వయుజ శుద్ధ పంచమి,షష్టి మూలా నక్షత్రం నాడు దుర్గమ్మ సరస్వతీ దేవిగా దర్శనమిస్తుంది.సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు.
తల్లి సకల విద్యలను ప్రసాదించి,జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యాశక్తి.
త్రిశక్తులలో మహాలక్ష్మి,మహా కాళి,మహాసరస్వతి మూడు రూపాలు.
దసరా నవరాత్రుల్లో సరస్వతీ దేవి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంరోజు ఈ అలంకారం చేస్తారు.ఈ రోజున అమ్మవారిని విద్యార్ధులు భక్తితో పూజిస్తే అన్నింటా విజయం లభిస్తుందని నమ్మకం.సరస్వతీ దేవి ధవళ వస్త్రాలను ధరించి,తెల్లని హంస వాహనం పై చేతిలో కచ్ఛపి అనే వీణను ధరించి వీణాపాణి గా దర్శనమిస్తుంది.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భావతు మే సదా ||
యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభి ర్దేవైస్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా