పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, మార్చి 2012, శుక్రవారం

ఆనంద "నందన" ఉగాది శుభాకాంక్షలు...!



కనులకింపుగా ... కలలు పండగా
వసంత శోభతో ... షడ్రుచుల రుచులు విందుతో
విచ్చేసింది ఆనందాల "నందన" ఉగాది.
సుఖ సంతోషాలను తెచ్చింది .. మన తెలుగు సంవత్సరాది.


తీపి ,చేదు,ఉప్పు,కారం,పులుపు,వగరు
కలగలసిన అద్భుతం ఉగాది పచ్చడి..
సంతోషం ,బాధ,ఇష్టం,కష్టం,గెలుపు,ఓటమి
కలగలసిన
అద్భుతం జీవితం..

కొత్త ఆశలతో,ప్రణాళికలతో మనందరం ఆనందంగా ఆహ్వానిస్తున్న
"నందన" నామ సంవత్సరం లో అందరూ సుఖసంతోషాలతో,
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని
కోరుకుంటూ ...


శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు




అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు...



నిద్రలో ఉలిక్కిపడి లేచినప్పుడు తన నిద్రమానుకుని నన్ను జోకొట్టి నిద్రపుచ్చింది..
కలల ఊయలలో నన్ను మెల్ల మెల్లగా ఊపింది..

ఎలాంటి
పరిస్థితిలోనైనా నీకు నేనున్నానని స్నేహపూరితంగా
నాకు ధైర్యం చెప్పింది..

బాధని తట్టుకునే ధైర్యంలేని నా మనసు కన్నీరుగా మారినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని
నా కన్నీటిని తన చీర చెంగుతో తుడిచింది..

తనని విసిగించే పనులు చేసి మనశ్శాంతి లేకుండా చేసినా భరిస్తుంది.
అర్ధంలేకుండా నేను కోప్పడినా అర్ధం చేసుకుంటుంది..

మొత్తం ప్రపంచం మీద అలిగి నేను కోపంగా నిద్రపోయినప్పుడు నెమ్మదిగా
దుప్పటి కప్పి,తన కొంగులో నన్ను దాచుకుంటుంది..

మొదటి గురువుగా జీవిత పాఠాల్ని నేర్పుతుంది
పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ కీ తను తీసిపోను అంటుంది.

రెక్కలొచ్చి మనం ఎగిరిపోయినప్పుడు మన ఉన్నతికి గర్విస్తుంది
తన గూటిలోనే తను ఉండిపోతుంది..

అమ్మంటే సృష్టి, అమ్మంటే సహనం, అమ్మంటే త్యాగం, అమ్మంటే ప్రేమ
"అమ్మ వంటిది ... అంత మంచిది అమ్మ ఒక్కటే"


ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మను భగవంతుడు
ఆయురారోగ్యాలతో
దీవించి, కాపాడాలని,
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..
అమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


"నా
చిన్నిప్రపంచం
"






Related Posts Plugin for WordPress, Blogger...