పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, మార్చి 2012, శుక్రవారం

అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు...



నిద్రలో ఉలిక్కిపడి లేచినప్పుడు తన నిద్రమానుకుని నన్ను జోకొట్టి నిద్రపుచ్చింది..
కలల ఊయలలో నన్ను మెల్ల మెల్లగా ఊపింది..

ఎలాంటి
పరిస్థితిలోనైనా నీకు నేనున్నానని స్నేహపూరితంగా
నాకు ధైర్యం చెప్పింది..

బాధని తట్టుకునే ధైర్యంలేని నా మనసు కన్నీరుగా మారినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని
నా కన్నీటిని తన చీర చెంగుతో తుడిచింది..

తనని విసిగించే పనులు చేసి మనశ్శాంతి లేకుండా చేసినా భరిస్తుంది.
అర్ధంలేకుండా నేను కోప్పడినా అర్ధం చేసుకుంటుంది..

మొత్తం ప్రపంచం మీద అలిగి నేను కోపంగా నిద్రపోయినప్పుడు నెమ్మదిగా
దుప్పటి కప్పి,తన కొంగులో నన్ను దాచుకుంటుంది..

మొదటి గురువుగా జీవిత పాఠాల్ని నేర్పుతుంది
పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ కీ తను తీసిపోను అంటుంది.

రెక్కలొచ్చి మనం ఎగిరిపోయినప్పుడు మన ఉన్నతికి గర్విస్తుంది
తన గూటిలోనే తను ఉండిపోతుంది..

అమ్మంటే సృష్టి, అమ్మంటే సహనం, అమ్మంటే త్యాగం, అమ్మంటే ప్రేమ
"అమ్మ వంటిది ... అంత మంచిది అమ్మ ఒక్కటే"


ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మను భగవంతుడు
ఆయురారోగ్యాలతో
దీవించి, కాపాడాలని,
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..
అమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


"నా
చిన్నిప్రపంచం
"






10 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో పాటుగా నందన నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

వనజవనమాలి చెప్పారు...

నాని గారు.. హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు మారు ఇలాగే పుట్టినరోజులు మరెన్నో..జరుపుకోవాలని..మీ బిడ్డలకి అండ -దండగా ఉంటూ..వారి వారి అభివృద్దిని కన్నులారాచూస్తూ.. ఆనందంగా.సంతోషంగా..జీవితం గడపాలని..కోరుకుంటూ ..మరొకమారు పుట్టినరోజు శుభాకాంక్షలు. .

సుభ/subha చెప్పారు...

ఎంత బాగా చెప్పారండీ.. నేను కూడా అమ్మకి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పానని చెప్పండి రాజీ గారు.

రాజి చెప్పారు...

"చిలమకూరు విజయమోహన్" గారూ..
మా అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు,
అలాగే ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందించినందుకు ధన్యవాదములండీ..
మీకుకూడా ఉగాది శుభాకాంక్షలు!

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
అమ్మకు మీ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటూ మీరు మంచి మనస్సుతో అందించిన దీవెనలన్నీ నిజంకావాలని కోరుకుంటూ
మీకు హృదయపూర్వక ధన్యవాదములు..
మీకు,మీ కుటుంబ సభులకు ఉగాది శుభాకాంక్షలు!

రాజి చెప్పారు...

"సుభా" గారూ.. పోస్ట్ నచ్చినందుకు,
అలాగే అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసినందుకు థాంక్సండీ!
అమ్మకు తప్పకుండా అందిస్తాను మీ హృదయపూర్వక పుట్టినరోజు శుభకాంక్షలను..

జ్యోతిర్మయి చెప్పారు...

చాలా ఆలస్యంగా చూశాను..నా తరుపున కూడా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయండీ..

రాజి చెప్పారు...

జ్యోతిర్మయి గారూ..
అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసినందుకు థాంక్సండీ!

రసజ్ఞ చెప్పారు...

ఛ! నేనెప్పుడూ లేటే! మీ అమ్మగారికి నా తరఫున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు (చాలా ఆలస్యంగా) ! ఈ సారికి మన్నించేయండి!

రాజి చెప్పారు...

రసజ్ఞ గారూ థాంక్సండీ..మన్నించటం ఎందుకండీ..
ఆలస్యంగానైనా మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకోవటమే నాకు చాలా సంతోషం!

Related Posts Plugin for WordPress, Blogger...