స్నేహం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్నేహం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
5, ఆగస్టు 2012, ఆదివారం
20, మే 2012, ఆదివారం
నా ప్రియనేస్తం...
మానవ సంబంధాలు స్వార్ధపూరితమే అయినా కొన్ని బంధాలు జీవితాంతం తోడూ,నీడగా జీవితాన్ని నందనవనం చేస్తాయి జీవితమనే పూలతోటలో కొందరి ఆగమనం వసంతమైతే మరికొందరి ఆగమనం గ్రీష్మం.మనసును బాధించే కష్టమైనా, ఆహ్లాదపరిచే సంతోషమైనా పంచుకునే ఆత్మీయ నేస్తం ఒకరు తమకంటూ ఉండాలని ప్రతి మనిషీ కోరుకుంటారు ...అలాంటి ఆత్మీయనేస్తమే
ఈ "నా ప్రియనేస్తం"
ఈ "నా ప్రియనేస్తం"
నా ప్రియ నేస్తం....
ప్రపంచం అంతా దూరం అయినా...,
నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేదే
నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేదే
నిజమైన స్నేహం...
ఆ స్ధానంలో “నాకు నువ్వు” “నీకు నేను”
ఒకరికొకరం...,
మన స్నేహమే మన ప్రపంచం
“నువ్వు” అనే ఈ రెండక్షరాలే
మన స్నేహమే మన ప్రపంచం
“నువ్వు” అనే ఈ రెండక్షరాలే
నా చేయి పట్టి నడిపిస్తుంటే
" నువ్వు" అనే ఈ రెండక్షరాలే
" నువ్వు" అనే ఈ రెండక్షరాలే
నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే
" నువ్వు"అనే ఈ రెండక్షరాలే
నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే
ఇంతకు ముందెపుడూ నేనెరుగని
మమతానుబంధమేదో
నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....
నా ప్రతి అడుగులో
నువ్వు తోడు వున్నావనే భావన
ఇంతకు ముందెపుడూ నేనెరుగని
మమతానుబంధమేదో
నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....
నా ప్రతి అడుగులో
నువ్వు తోడు వున్నావనే భావన
ఎంతో ఊరటనిస్తుంటే
సృష్టిలోనే తీయనైన నీ స్నేహ మాధుర్యాన్ని
సృష్టిలోనే తీయనైన నీ స్నేహ మాధుర్యాన్ని
నాకు చవిచూపిస్తుంటే
నిన్నటిదాకా కదలనని మొరాయించిన కాలం
నీ ఆగమనంతో వేగంగా
యుగాలు కూడా క్షణాల్లా కరిగి పోతుంటే ...
నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా
నా గుండెల్లో దాచుకొని....,
ఏవేవో అంతులేని ఆలోచనలతో
సతమతమవుతున్న నా మనసుకి చెప్తున్నా...
ఇదిగో "నీ ప్రియ నేస్తం" అని
నీ నవ్వు చెప్పింది నాకు నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
సినిమా - అంతం
సంగీతం - కీరవాణి
లిరిక్స్ - సిరివెన్నెల
సింగర్ - S.P.బాలు


లేబుళ్లు:
నాకు నచ్చిన కవితలు,
నాకు నచ్చిన పాటలు,
ప్రేమ,
స్నేహం
7, ఆగస్టు 2011, ఆదివారం
15, డిసెంబర్ 2010, బుధవారం
నా చిన్నారిస్నేహం...

నిన్న మాఇంటికి అనుకోని అతిధి వచ్చింది.తను నాచిన్నప్పటి ఫ్రెండ్ రాజేశ్వరి.St'anns girls high school లో నేను 6th class లో జాయిన్ అయినప్పటినుండి తను నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్.మా స్నేహం 6th నుండి 10th వరకు ఒకే స్కూల్లో ఎంతో సరదాగా వుండేది.10th తర్వాత నేను మా వూర్లో,తను తెనాలిలో ఇంటర్ జాయిన్ అయ్యాము అయినా కొన్నాళ్ళు మా friendship కంటిన్యూ అయ్యింది.వాళ్ళ ఫామిలీ గుంటూరు షిఫ్ట్ అవ్వటం,తనకి పెళ్లి కావటం,నేను లా లో జాయిన్ అవ్వటం వీటన్నిటి తర్వాత మా స్నేహానికి పూర్తిగా బ్రేక్ పడినట్లే అయింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి మా అమ్మావాళ్ళింటికి నాకోసం వచ్చిన తనని చూసి నాకు చాలా సంతోషంగా,ఆశ్చర్యంగా కూడా అనిపించింది.తను మలేషియాలో ఉంటున్నానని ,ఒక పాప అని ప్రస్తుతం వాళ్ళ అమ్మ వాళ్ళింటికి గుంటూరు వచ్చానని,ఇంకా 3,4 నెలలు ఇండియాలోనే ఉంటానని చెప్పింది.కనీసం 10 సంవత్సరాలుగా ఫోనులో కూడా మాట్లాడుకోని మేమిద్దరం మాట్లాడుకోవటానికి చాలా విషయాలు వున్నా,తను వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళే పని ఉండటంతో మళ్ళీ కలుద్దామని అనుకున్నాము.సృష్టిలోమధురమైనది,జీవితంలో మరువలేనిది స్నేహం అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుందేమో...
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
స్నేహం