పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

19, ఏప్రిల్ 2011, మంగళవారం

స్వప్నాల వెంట స్వర్గాల వేట...తుదిలేని దోబూచులాట...


మనిషి జీవితంలో సంఘటనలన్నీ ఒక దాని వెంట మరొకటి మనిషి ప్రమేయం లేకుండా జరిగిపోతూనే వుంటాయి,
అలాగే జరగాల్సినవి ముందే రాసి పెట్టి ఉంటాయని కూడా తెలుసు...కానీ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు,ఆశలు,ఆశయాలు ఆలోచనలు,ఆందోళనలతో ప్రతి మనిషి సతమతమవుతూనే వుంటాడు...

మనిషి జీవితంతో కాలం,విధి ఆడే ఆటను దొంగాటతో పోల్చుతూ జరగాల్సినవి ముందే రాసిపెట్టి వున్నా కాలం తో పందెం వేసి మన ప్రయత్నం మనం చేసి గెలవడమా లేక పోరాడి ఓడటమా అనేది మనిషి కర్తవ్యం అని
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాట దొంగాట సినిమాలోది.జగపతిబాబు,సౌందర్య నటించిన ఈ సినిమా నాకు చాలా నచ్చుతుంది..ముఖ్యంగా ఈ పాట నాకు చాలా ఇష్టం..


స్వప్నాల వెంట స్వర్గాల వేట
తుదిలేని దోబూచులాట



అటా ఇటా మరి నువ్వు కోరే దారి
ఆగలేవు సాగలేవు వో బాటసారి ... 
స్వప్నాల వెంట స్వర్గాల వేట...తుదిలేని దోబూచులాట 
ప్రతివారి కంట కొలువున్నదంట ...కోరేటి బంగారుకోట 

ఏ దారి వెంట ఏ తీరముందో... తెలిపేటి వేలుగేమిటంట 
తెలవారితే కల తీరితే ... కరిగేను ఈ దొంగాట

ళ్లారా చూస్తూనే వుంటారు అంతా..
హృదయానికే వేస్తారు గంత
 నిజమేమో నీడల్లే వుంటుంది చెంత..
మనసేమో అటు చూడదంట 

ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం..
అది నాలుగు స్తంభాలాట 
మునుముందే రాసుంది రానున్న గమ్యం.. 
కనిపిస్తే ఏముంది వింత

 మనతో మనం దొంగాటలు...
ఆడడమే బ్రతుకంటే అర్ధం 
స్వప్నాల వెంట స్వర్గాల వేట...తుదిలేని దోబూచులాట
 
కాలంతో ప్రతి వారు ఏదో ఒకనాడు.. 
ఆడాలి ఈ మాయ జూదం 
గెలిచామో,వోడామో అది ముఖ్యం కాదు.. 
ఊహలతో వెయ్యాలి పందెం 

వరమేదో పొందామనుకున్నవారు...
పోయింది పోల్చలేరు 
పోగోట్టుకున్నామనుకున్నవారు ...
పొందింది చూడలేరు 

విధి ఆడిన దొంగాటలో ...
ఫలితాలు తేల్చేదెవరు . 
స్వప్నాల వెంట స్వర్గాల వేట...తుదిలేని దోబూచులాట 
 ప్రతివారి కంట కొలువున్నదంట ...కోరేటి బంగారుకోట 

ఏ దారి వెంట ఏ తీరముందో... 
తెలిపేటి వేలుగేమిటంట 

తెలవారితే కల తీరితే ... కరిగేను ఈ దొంగాట



Related Posts Plugin for WordPress, Blogger...