దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ,ప్రజల్లో సమాజం పట్ల అవగాహనను కలిగించి,వ్యవస్థ లోని లోపాలను తెలియచేసేలా ఒక మంచి రియాలిటీ షో "అమీర్ ఖాన్ - సత్యమేవ జయతే"...హిందీ,తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ...ఇలా అన్ని భాషల్లో 'సత్యమేవ జయతే' కార్యక్రమం మే 6 నుండి ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది..
ఈ కార్యక్రమం కోసం అమీర్ ఖాన్ మన దేశమంతా తిరుగుతూ వివిధ వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారట.ఈ ప్రోగ్రాం కోసం తయారు చేసిన టైటిల్ సాంగ్ చాలా బాగుంది. నాకు అమీర్ ఖాన్ ఫేవరేట్ ఆర్టిస్ట్,
ఇప్పుడు అమీర్ చేస్తున్నది మన దేశానికి,ప్రజలకి సంబంధించిన ఒక మంచి కార్యక్రమం "మన జీవితం బాగుంది కదా ఇంక ఎదుటి వాళ్ళ తో మనకెందుకు" అని అనుకోకుండా ,నేను కూడా ఈ సమాజం లో ఒక భాగమే కాబట్టి,నా వంతుగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో ... మనుషుల మనస్సులో,ఆలోచనల్లో కొంతైనా మార్పు తీసుకురావాలన్న ఒక సదుద్దేశ్యంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్తున్నారు అమీర్ ఖాన్..
అమీర్ ఖాన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెడతాం కాబట్టి ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ..
ఇప్పటి నుండి ప్రతి వారం ఈ "సత్యమేవ జయతే" షో చూడాలని నిర్ణయించుకున్నాను.
Aamir's Satyamev Jayate
A Love Song To India
A Love Song To India
నీ సౌరభం సమ్మోహనం ... నీ తోటిదే నా జీవితం
నా హృదయమూ నీకంకితం
వేరెవరికీ అది దుర్లభం
ఈ మోహమూ ... ఈ దాహమూ
మోహమనే ఈ దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము
నీవే నేర్పావూ ... నీ జాతికి అర్ధం
నీ వరములో దాచానూ ... నా జీవిత పరమార్ధం
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా ... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
నీ కాంతిలో నీ క్రాంతిలో ... నే తప్పనూ దారెన్నడూ
నా యత్నమూ ... ధృఢ చిత్తమూ
పూదోటయే ఎల్లప్పుడూ
నీ బాటలో చిక్కుల్ని నే ... విడదీస్తూ దరి చేరతా
నీ ప్రేమయే అలరించగా ... సుస్వరములో నే పాడతా
ఈ మోహమూ ... ఈ దాహమూ
మోహమనే ఈ దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము
నీవే నేర్పావూ ... నీ జాతికి అర్ధం
నీ వరములో దాచాను నా జీవిత పరమార్ధం
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
నీ సౌరభం సమ్మోహనం ... అహ మధురమూ
అది మదిరమూ
చల్లావూ విత్తు నీవే ... ఈ అంకురం ఆ ఫలితమూ
నను నన్నుగా దరి చేర్చుకో ... అని అననులే ఏ నాటికీ
నీ దరికి చేరే అర్హత సాధిస్తా ముమ్మాటికీ
నా ఊపిరీ నా స్పందనా ... ఈ జీవితం నీ కోసమే
ప్రతి సఫలతా ... ప్రతి విఫలతా
ప్రతి యత్నమూ నీ నామమే
నే మారతా ... నీ కోసమూ...
ఈ మోహమూ ... ఈ దాహమూ
మోహమనే ఈ దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
గురి చెయ్యి నన్ను పరీక్షకీ
లోపాలు తెలుపు నా ఆత్మకీ
లొసుగున్ననూ ... ముసుగెందుకు
సత్యాన్ని చూసి బెదురెందుకూ...
నను మార్చుకోవలసొచ్చినా ... నే మారతా నీ కోసమూ
నే నిప్పుపై నడవాల్సినా ... నే నడుస్తా నీ కోసమూ
నీ ప్రేమయే సంకల్పమూ
నా రక్తమూ ప్రతి చుక్కలో ... నా మేనిలో రుధిరమ్ములో
నీ సౌరభం ప్రతి ... ధారలో
ఈ మోహమూ ... ఈ దాహమూ
మోహమనే ఈ దాహమూ
అణువణువునా అలరారేనూ
నీ ప్రేమయే సర్వస్వము
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
సత్యం నా ప్రేమా... సత్యమేవ జయతే
సత్యమేవ సత్యమేవ సత్యమేవ జయతే
మ్యూజిక్ డైరెక్టర్ : రామ్ సంపత్
లిరిక్స్ : V . చక్రవర్తి
సింగర్స్ : రామన్ మహదేవన్, రాజీవ్ సుందరేసన్
Satyamev Jayate - 6th May 2012