ఈ రోజు సిస్టర్స్ డే అంటే సోదరీమణుల దినోత్సవం...
అందుకే నా స్వీట్ సిస్టర్ రమ్యకి హ్యాపీ సిస్టర్స్ డే...
నా చిన్ని ప్రపంచంలో అందరికంటే ఎక్కవ చెప్పుకోవాల్సిన గ్రేట్ పర్సన్ మా చెల్లి అని నా గట్టి నమ్మకం ....నేను,తమ్ముడు తర్వాత చాలా గ్యాప్ లో పుట్టిన మా చెల్లి తో ఆడుకోవటం మాకు చాలా సరదాగా వుండేది
స్కూల్ కి కూడా వెళ్ళకుండా తనతో ఆటలు ఆడుకునే వాళ్ళం.
తన ముద్దు పేరు స్వీటీ మా తమ్ముడు పెట్టిన పేరు.
నా ఫ్రెండ్స్,తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ చాలా సరదాగా తనని ఎత్తుకుని తిప్పేవాళ్ళు .
సండే స్పెషల్ క్లాసులకి వెళుతూ నా వెంట తమ్ముడిని,చెల్లిని నా సైకిల్ మీద తీసుకువెళ్ళే దాన్ని.
నా టెన్త్ అయిపోయిన తర్వాత తమ్ముడు,చెల్లి ఒక స్కూల్ కావటం తో తన బాధ్యత తమ్ముడిది అయ్యింది.
వాడి సైకిల్ కి చెల్లి కోసం స్పెషల్ సెట్టింగ్స్ పెట్టించేవాడు.
ముందు ఒక చిన్న సీట్,కాళ్ళు పెట్టుకోవడానికి ముందు రెండు చిన్ని స్టాండ్ ఇలా వుండేది వాడి సైకిల్ సెట్టింగ్.
ఒక సారి తన కాలు సైకిల్ టైర్ లో పడి దెబ్బ తగిలింది.అందుకే ఈ జాగ్రత్తలన్నమాట .
మా ఇంటి గారాలపట్టి మా స్వీటీ.
ఇంట్లో అందరి గారాబం తో తన అల్లరి ఎక్కువయ్యింది అంటుంది మా అమ్మ.
అది నిజమే లిటిల్ సోల్జర్ సినిమాలో అన్నని వెంటపడి వేధించే బన్నీ లాంటిది మా చెల్లి ...
ఎక్కడికి వెళ్లిన్నా తనకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావడం నాకు, తమ్ముడికి అలవాటు.
మేము తెచ్చిన ఆ గిఫ్ట్ లన్నీ చిన్నప్పటి నుండీ ఇప్పటి దాకా మూడు పెట్టెలకి దాచి పెట్టింది.
ఆ పెట్టెలు చూసినప్పుడల్లా అల్లరిపిల్ల సినిమాలో మీనా పెట్టెలు,
మోయ్యవోయ్ కూలి పడేస్తాం అనే మీనా గుర్తుకు వస్తుంది మా ఇంట్లో అందరికీ...
తను దాచి పెట్టుకునే వాటిలో నేను విజయవాడ నుండి పంపిన కలర్ స్కెచెస్ నుండి,
తమ్ముడు మద్రాస్ నుండి తెచ్చిన డాల్ ,
వాళ్ళ బావ అంటే మా వారు,వదిన కొనిపెట్టిన చాక్లెట్ రేపర్స్ కూడా వుంటాయి.
నా పెళ్లి ,తమ్ముడి పెళ్లిలో వచ్చిన వెండి వస్తువుల్లో కూడా కొన్ని చిన్ని వస్తువులు దాచుకుని,
ఎప్పుడైనా మా మరదలు సరిత అమాయకంగా ఇవన్నీ ఏమి చేస్తావు స్వీటీ అంటే చాలు ఇల్లు పీకి పందిరి వేస్తుంది..
తన హాబీస్ అంటే చెప్పలేనన్ని.
రకరకాల ఎరేజర్స్ ,కీ చైన్స్ కల్లెక్ట్ చేయటం,
డ్రాయింగ్ లో తను ఎక్కడ కాంపిటీషన్ కి వెళ్ళినా తనదే మొదటి ప్రైజ్.
ఇక నెట్ లో తన టాలెంట్ మాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది,
మల్టీ మీడియా అంతా తన సొంతగా గూగుల్ టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకుంది,
నాకు,తమ్ముడికి తనే గురువు.
నెట్ లో తన టాలెంట్ చూసి మావారు తనని ఏదైనా ఆనిమేషన్ కోర్సు చేయించాల్సింది బి.ఫార్మసీ కాకుండా అంటుంటారు.
సొంతగా బ్లాగ్ టెంప్లేట్స్ తయారు చేయటం,బ్లాగింగ్ ,వీడియో మిక్సింగ్ తో పాటలు చేయటం లో తనకి మంచి టాలెంట్ వుంది.
నా"Gata Rahe Mera Dil" బ్లాగ్ టెంప్లేట్ తను చేసిందే...
నాకు ఇష్టమైన పాటలు తనతో వీడియో మిక్సింగ్ చేయించేదాన్ని .
తను వీడియో మిక్సింగ్ చేసి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన పాటల్లో చాలా పాటలు నాకు ఇష్టమైన పాటలు.
ఇంట్లో అందరి పుట్టిన రోజులకి తను ఇచ్చే మొదటి గిఫ్ట్ తను చేసి, యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన బర్త్ డే సాంగ్.
ఫోటోగ్రఫి తనకి చాలా ఇష్టమైన హాబీ.ఎక్కడికి వెళ్ళినా అక్కడ నచ్చిన వాటిని తన కెమెరాలో బంధిస్తుంది.
పోయిన సంవత్సరం రాఖి గిఫ్ట్ గా తనకి తమ్ముడు ఇచ్చిన కెమేరాతో ప్రయోగాలు చేస్తుంది ..
నెట్ లో చూసి రకరకాల వంటలు ప్రయోగాలు చేస్తుంది.
ఏదైనా వంట వెరైటీగా కనిపిస్తే చాలు స్వీటీ చేసింది అని చెప్పేయగల రేంజ్ లో వుంటుంది తన వంట..
మా కళ్ళ ముందు పుట్టి మాతో ఆటలు ఆడుకున్న మా చెల్లి ఇప్పుడు బి.ఫార్మసీ చదువుతున్నా
మాకు ఇంకా చిన్న పిల్లలాగానే అనిపిస్తుంది.
తను నాకు చెల్లే కాదు ఒక మంచి ఫ్రెండ్ కూడా..
బంగారం అంటూ నన్ను ముద్దుగా పిలుస్తూ నాకే పెద్దదానిలా సలహాలు చెప్తూ నువ్వొక పిచ్చిదానివి
నీకేమి తెలియదు అంటూ ..
ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అమ్మ మీద,తమ్ముడి మీద నాకు చాడీలు చెప్తూ అల్లరి చేసే అల్లరిపిల్ల ...
MY SWEET LITTLE SISTER AND MY DEAR FRIEND
LITTLE PRINCESS ...RAMYA NAIDU...
HAPPY SISTER'S DAY AND HAPPY FRIENDSHIP DAY..TO YOU
LITTLE PRINCESS ...RAMYA NAIDU...
HAPPY SISTER'S DAY AND HAPPY FRIENDSHIP DAY..TO YOU
రాజి