"నాసిక్ లోని పంచవటి" తర్వాత అనుకున్న ప్రకారం మా ప్రయాణం భీమశంకర జ్యోతిర్లింగం దగ్గరికి. కానీ మధ్యలో మాకు కనిపించిన ఒక అద్భుతమే Fort Shivneri - శివనేరి కోట.ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థానం.
Landmark : A statue of Shivaji Maharaj |
మహారాష్ట్ర లోని నాసిక్ నుండి 136,పూణే నుండి 105 కిలోమీటర్ల దూరంలో జున్నార్ సిటీకి దగ్గరగా,జున్నార్ లోకి ఎంటర్ అవ్వగానే కొండ మీద శివనేరి కోట కనపడుతూ ఉంటుంది. మహారాష్ట్రలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ లో ఒకటి మాత్రమే కాదు మా అందరికీ చాలా చాలా నచ్చిన కోట కూడా.నాలుగు వైపులా ఎత్తైన రాళ్ళు ఉన్న కొండమీద ఎంతో పటిష్టంగా శత్రు దుర్భేద్యంగా కోటని నిర్మించారు.శాతవాహనుల కాలంనాటి ఈకోట యాదవ,బహుమనీ,మొఘల్ రాజుల పరిపాలన నుండి 1599 లో శివాజీ తాతగారైన మాలోజి భోంస్లే ఆధీనంలోకి, ఆ తర్వాత శివాజీ తండ్రి షాహాజీ భోంస్లే చేతికి వచ్చింది.ఆదిల్ షా సైన్యంలో జెనరల్ గా ఉన్న శివాజీ మహారాజ్ తండ్రి అక్కడ తరచుగా జరుగుతున్న యుద్ధాలకు భయపడి,గర్భవతిగా ఉన్న జిజియా భాయిని ఆమె రక్షణ కోసం ఈ శివనేరి కోటలో ఉంచారట.
శివాజీ మహారాజ్ 19 ఫిబ్రవరి 1630 లో ఇక్కడే జన్మించారు.జిజియాబాయి పూజించే, ఈ
కోటమీద ఉన్న శివాయి (పార్వతీ దేవి) అమ్మవారి దయవల్ల పుట్టాడు కాబట్టి
శివాయి అమ్మవారి పేరుమీద శివాజీ అని పేరు పెట్టారట. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జన్మించి, తన బాల్యం గడిపిన ఈ శివనేరి కోట నిజంగా అద్భుతం. ఒక మహావీరుడు పుట్టి,పెరిగిన చోట మనం ఉన్నామనే భావన కూడా అద్భుతమే..ఈ కోట ఎక్కటం ట్రెక్కింగ్ చేసే వాళ్లకి చాలాఇష్టమైన ప్రదేశమట.
కోటపైకి వెళ్ళే విశాలమైన రాజమార్గం
ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కొండ దారుల్లో వెళ్తే మామూలుగా వెళ్ళే వారి కోసం మెట్లదారి కూడా ఉంది. వాహనాలని కొండ కింద భాగంలో పార్కింగ్ ప్లేస్ లో ఉంచి,మెట్లదారిలో కోటకి వెళ్ళొచ్చు. కోటని చేరుకోవటానికి పర్యాటక శాఖ ఇంతకుముందు ఉన్న పాతమెట్లను సరిచేసి మెట్ల మార్గం విశాలంగా తయారుచేయటంతో పైకి ఎక్కటం కొంచెం సులభంగానే అనిపించింది.కోట పైకి వెళ్ళే దారంతా పచ్చని చెట్లు,పూల మొక్కలతో పార్కులు చాలా బాగున్నాయి.పరిసరాలు కూడా శుభ్రంగా ఎక్కడా కొంచెం కూడా దుమ్ము కూడా లేకుండా ఉండటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కోట పై భాగానికి వెళ్ళాలంటే 7 ద్వారాలు దాటి వెళ్ళాలి.సుమారు 400 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.ఈ ఏడు మార్గాలు ఉన్న దారిని రాజమార్గం అంటారట.
Gate1 - Mahadarwarja - Main Gate
Gate2 - Ganesh Darwaja
Gate3 - Pir Darwaja
Gate4 - Hathi Darwaja
Gate5 - Mena Darwaja
Gate6 - kulup Gate
Gate7 - Shivai Devi Darwaza
Gate 1 - మహా దర్వాజా -
కోటకి మొదటి ద్వారం- Main Gate పేరుకి తగినట్లుగానే రాజసంగా పెద్ద పెద్ద తలుపులతో ఉంటుంది.
కోటపైకి వెళ్ళే విశాలమైన రాజమార్గం
Gate1 - Mahadarwarja - Main Gate
Gate2 - Ganesh Darwaja
Gate3 - Pir Darwaja
Gate4 - Hathi Darwaja
Gate5 - Mena Darwaja
Gate6 - kulup Gate
Gate7 - Shivai Devi Darwaza
Gate 1 - మహా దర్వాజా -
కోటకి మొదటి ద్వారం- Main Gate పేరుకి తగినట్లుగానే రాజసంగా పెద్ద పెద్ద తలుపులతో ఉంటుంది.
పిర్ దర్వాజా దగ్గర మనిషి ముఖం ఆకృతి |
ఏనుగులు కూడా తలుపులు బద్దలు కొట్టలేకుండా ఉండేలా బలమైన శూలాలను తలుపులో అమర్చటం
ఈ దర్వాజా ప్రత్యేకత
హాథీ దర్వాజా దగ్గర మా అమ్మ |
Hathi Gate |
Gate 6 - (Lock) కులుప్ దర్వాజా
Gate 7 - శివాయి దేవి దర్వాజా
అంబర్ ఖానా - ధాన్యం నిల్వ చేయటానికి ఉపయోగించిన ప్రదేశం
కొండపైన నీటి తటాకాలు
శివ్ కుంజ్ సభామండపం అని పిలిచే చోట బాల శివాజీ , వీరమాత జిజియా బాయి పంచలోహ విగ్రహాలు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
శివ్ కుంజ్ కి దగ్గరలోనే శివాజీ జన్మించిన కోట ఉంది .శివాజీ జన్మించిన ఈ కోటని శివ మందిర్ అని కూడా పిలుస్తారు.
శివాజీ ఊయల-
శివాజీ జన్మించిన ప్రదేశానికి గుర్తుగా ఇక్కడ శివాజీ విగ్రహం ,ఊయల ఉంటాయి.ప్రతి సంవత్సరం శివాజీ పుట్టినరోజు నాడు ఈ ఊయలను పూలతో అలంకరించి పుట్టినరోజు వేడుక చేస్తారట.
మొఘల్ కాలం నాటి 2 మినార్ల మసీదు
కోటపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహారాష్ట్ర Map
కోట పైనుండి కనపడే అందమైన ప్రకృతి దృశ్యాలు
కొండపైన Archaeological Survey of India వాళ్ళు పెంచుతున్న
పచ్చని,అందమైన పార్కులు
Kadelot Point
కోటమీద చివరిగా ఉండే కట్టడం.
ఆరోజుల్లో నేరస్తులను ఇక్కడి నుండి కిందికి తోసి మరణశిక్ష విధించే వాళ్ళట.
అప్పటి రాజులు,రాజరికాలు ఇప్పుడు లేవు కానీ వారి గత చరిత్రలు మాత్రం ఇప్పటికీ ఘన చరిత్రలుగా చిరస్థాయిగా నిలిచిపోయి,ఎప్పటికీ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూనే ఉంటాయి.చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక మహావీరుడు జన్మించి,నడిచిన కోట చూడటం చాలా ఆనందంగా,ఎప్పటికీ గుర్తుండే ఒక గొప్ప ప్రదేశంగా మా మనసుల్లో నిలిచిపోయింది.
THE GREAT SHIVAJI MAHARAJ
శివనేరి కోట
My Video - Raaji
My Video - Raaji