పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, డిసెంబర్ 2011, ఆదివారం

Thankyou ఫ్రెండ్స్ & ఫ్యామిలీ ...

ఈ రోజు... మంచిరోజు మరపురానిది ...మధురమైనది
అన్నట్లుగా జరిగింది నా పుట్టినరోజు..
ఉదయాన్నే కుటుంబ సభ్యులందరి శుభాభినందనలతో మొదలైన నా పుట్టినరోజు
రోజంతా బంధువులు,స్నేహితుల శుభాకాంక్షలతో, నా ప్రియమైన వాళ్ళందరి మధ్య
BirthDay సెలెబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషాన్ని కలిగించింది.
ముఖ్యంగా నా పుట్టినరోజుకి ప్రత్యేక అతిధులు మా చెల్లి,మరిది గారు లీవ్ లేకపోయినా
వీలు కల్పించుకుని వచ్చి నా పుట్టినరోజుని ఒక మరిచిపోలేని రోజుగా గుర్తుండిపోయేలా చేశారు..

జీవితంలో ఏమి సాధించినా, సాధించకపోయినా,సంపాదించినా,సంపాదించకపోయినా
"నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,నీ కోసమే కన్నీరు నింపుటకు... నేనున్నానని నిండుగా పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము" అన్న మాట ఎంతో నిజం కదా..
అలా నా జీవితంలో ప్రతి సుఖంలో,కష్టంలో,గెలుపు, ఓటముల్లో తోడుండే
నా చిన్నిప్రపంచం లో అతి ముఖ్య భాగమైన నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు..

With Love : Sister & Brother In Law



ఇంక ఈ సంవత్సరం నా పుట్టినరోజుని మరింత అద్భుతమైనదిగా మార్చింది
నా చిన్నిప్రపంచం,నా చిన్ని ప్రపంచంలో నా "బ్లాగ్ స్నేహితులు"...
నాకు సంబంధించిన,నాకు సంతోషాన్ని కలిగించే విషయాలన్నిటినీ గత కొంతకాలంగా
నా చిన్నిప్రపంచం బ్లాగ్ లో ,నాకిష్టమైన పాటలు సరిగమలు...గలగలలు బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ వున్నాను..
అప్పుడప్పుడు కొంతమంది బాగుందని కామెంట్స్ ఇచ్చేవారు.

నా బ్లాగ్ మొదలు పెట్టినప్పటి నుండి నాకు ఎక్కువ కామెంట్ ఇచ్చి,నన్ను ప్రోత్సహించే వాళ్ళు
''మనస్వి- జయ'' గారు, ''సాహితి - మాలా కుమార్'' గారు ... ఇద్దరు దాదాపు నేను పెట్టే ప్రతి టపాలో
వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేసే వారు..
తర్వాత ''వనజ వనమాలి'' గారు ఎక్కువగా నా చిన్నిప్రపంచానికి వచ్చేవారు,
నాభావాలను
మెచ్చుకునే వారు..
ఇప్పుడు ''కడలి - సుభా గారు'' , ''నవరసజ్ఞ భరితం - రసజ్ఞ'' గారు,
"శర్కరి - జ్యోతిర్మయి"గారు, ''ఎందుకో?ఏమో!'' గారు నాచిన్ని ప్రపంచంలో కొత్త అతిధులు..
నా
ప్రతి టపాలో వాళ్ళ అభిప్రాయాలను నాతో పంచుకునే స్నేహితులు..

నా పుట్టిన రోజుకి కూడా నేను బ్లాగ్ లో పోస్ట్ పెట్టాను..కానీ నేను ఊహించనంత అభిమానం
నా బ్లాగ్ మిత్రుల నుండి లభించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ కామెంట్ ఇవ్వని వాళ్ళు కూడా
నాకు BirthDay శుభాకాంక్షలు చెప్పి నాకు ఎంతో సంతోషాన్ని కలిగించారు..
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటమే కాదు నాబ్లాగ్ గురించి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియచేశారు..
నా ఈ బ్లాగ్ మిత్రుల అభిమానం,శుభాభినందనలు
నా
పుట్టిన రోజుని మరువలేని రోజుగా గుర్తుండిపోయేలా చేశాయి..

నా బ్లాగ్ ఫ్రెండ్స్ లో పెద్దల దీవెనలతో,స్నేహితుల శుభాకాంక్షలతో,అభినందనలతో...
నా ఫ్రెండ్ 'సుభా' గారి 'సుభా'కాంక్షలతో పాటు అందించిన దీవెనల చిరుకానుక తో నా పుట్టినరోజు మరపురానిది..మధురమైనది గా నిలిచిపోయింది..

నా
పుట్టినరోజుకి మీ దీవెనలు,శుభాభినందనలతో నన్ను దీవించి,Wishes చెప్పిన
నా
బ్లాగ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు



Related Posts Plugin for WordPress, Blogger...