పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, జనవరి 2011, శనివారం

సంక్రాంతి శుభాకాంక్షలు


భోగభాగ్యాల భోగి
సరదా
,సంతోషాల సంక్రాంతి
కమ్మని
రుచుల కనుమ



అందరికీ సుఖసంతోషాలను,ఆయురారోగ్యాలను,
భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ
నా చిన్నిప్రపంచం తరపున అందరికీసంక్రాంతి పండుగ శుభాకాంక్షలు


రాజి

10, జనవరి 2011, సోమవారం

ఆగదేనాడు కాలము ఆగినా గడియారము….



కాలం లేడిలా పరుగులు తీస్తుంది…
కాలం సెలయేరులా నెమ్మదిగా సాగుతుంది.
కాలం చిన్నిపాపలా అమ్మయకంగా నవ్వుతుంది…
కాలం క్రూరంగా వికటాట్టహాసం చేస్తుంది.
కాలం ఆప్తమిత్రుడిలా వెంట వుండి నడిపిస్తుంది…
కాలం నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడుస్తుంది.
కాలం ఆహ్లాదకరమైన ఆమనిలా ఆకర్షిస్తుంది…
కాలం కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలా భయపెడుతుంది
కాలం ఎప్పుడూ నాదే అనిపిస్తుంది...
కాలం పాదరసంలా కళ్ళముందే జారిపోతుంది…

నిజానికి కాలం ఒక్కటే .
కానీ మనుషుల జీవితాన్ని బట్టి,మనిషి మానసిక పరిస్థితిని బట్టి,మనిషికి ఎదురవుతున్న అనుభవాలను,అవసరాలను అనుసరించీ,ఒక్కోసారి ఒక్కోరకంగా,ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది.

కాలం అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది, ఎన్నో గాయాలను మాన్పుతుంది,
భయపెట్టే సమస్యలను అధిగమించి,కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి మనసును సన్నద్ధం చేస్తుంది.
పోయిన సంవత్సరం అంతా నా లైఫ్ వుగాది పచ్చడిలాగా అన్ని రుచుల సమ్మేళనంతో వుంది.
కానీ ఇందులో కొంచెం చేదు ఎక్కువైందనే చెప్పాలి.
ఎన్ని సమస్యలు వున్నా,ఏది ఏమైనా కాలం మనకోసం ఎక్కడా ఆగదు కదా…
అలాగే 2010 కూడా,కొన్ని ఆనందాలను,కొన్ని సమస్యలను నాకోసం వదిలి తనంతట తాను వెళ్ళిపొయింది.

ఈ నూతన సంవత్సరం నాకు అతి పెద్ద సమస్యను,అతి పెద్ద సంతోషాన్ని రెండిటినీ ఒకే సారి తెచ్చినదని చెప్పొచ్చు.
ఎది ఏమైనా కాలమే అన్ని సమస్యలను పరిష్కరించే గొప్ప మేధావి కాబట్టి ఈ 2011 నా జీవితం లో ఒక మంచి మార్పు తేవాలని,నేను అనుకున్నది సాధించిన సంవత్సరంగా నాజీవితంలో 2011 గుర్తుండిపోవాలని,
ఈ నూతన సంవత్సరం నా చిన్ని ప్రపంచాన్ని సుఖశాంతులతో వుండేలా,అందరికీ మంచి తెస్తుందని మంచి చేస్తుందని ఆశిస్తూ…

నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు .

ఆగదేనాడు కాలము ఆగినా గడియారము….




రాజి

1, జనవరి 2011, శనివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


రాజి
Related Posts Plugin for WordPress, Blogger...