పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
పుట్టినరోజు శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుట్టినరోజు శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మార్చి 2017, గురువారం

మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు



నిన్న మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ ఉగాది పండగరోజే పుట్టింది కాబట్టి ప్రతి ఉగాదికి మాకు రెండు పండగలు.నిన్న face Book లో విషెస్ పెట్టాను.నా ఫ్రెండ్స్,మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ అమ్మకి విషెస్ చెప్పారు. ఎప్పుడూ బ్లాగ్ లో కూడా విషెస్ పెట్టేదాన్ని ఈసారి పెట్టలేదు.కొంచెం లేట్ గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఎంతైనా బ్లాగ్లో రాసుకున్నవన్నీ మంచి జ్ఞాపకాలుగా  ఎప్పటికీ నిలిచిపోతాయి కదా.. 

ఉగాది రోజునే పుట్టిన మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy BirthDay అమ్మ :)

మాలోనే తన చిన్నిప్రపంచాన్ని చూసుకుంటూ
నేను, తమ్ముడు,చెల్లి ఎలాంటి అసూయద్వేషాలు
లేకుండా ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా నిలవాలనే ప్రేమ,ఆప్యాయతలు

ఎవరికీ మేలు చేయలేకపోయినా,కీడుమాత్రం చేయొద్దని, 
మాకు మేముగా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో పాటు
కావాలని మాకు హాని చేయాలనుకునే వాళ్ళనుండి కాపాడుకోగలిగే ధైర్యం

ఎవరినుండి ఏమీ అతిగా ఆశించకూడదు,ఎవరి తోడు లేకపోయినా 
దేవుడు ఎప్పుడూ మనల్ని కాపాడతాడనే నమ్మకంతో పాటు,
సమాజంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ,మాట్లాడాలనే హద్దులు తెలుసుకునే ఇంగితఙ్ఞానం

రాత్రి ఉంటే పగలు కూడా ఉంటుంది, ప్రయాణం ఉంటే గమ్యం కూడా ఉంటుంది, 
అలాగే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది కాబట్టి 
ఎన్ని సమస్యలున్నా ఎదుర్కోవాలనే ఆత్మవిశ్వాసం

అన్ని విషయాలు గురువు,నేస్తంగా నేర్పిన, నేర్పుతున్న 
మా అమ్మని ఆయురారోగ్యాలతో కాపాడమని భగవంతుడ్ని వేడుకుంటూ,
ఎప్పటికీ మాకు తోడుగా,మా అందరితో సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ... 

Happy Birthday 🎂💐 అమ్మా 
Many Many Happy returns of the day...

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
Love u మా 💕💞💝
Raaji,Vamsi,Ramya



11, ఫిబ్రవరి 2013, సోమవారం

Happy BirthDay To " నా చిన్నిప్రపంచం "



  
నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

నా హృదయంలో నిలిచిపోయే భావాలు  ..
నన్ను నేను తెలుసుకునే అనుభవాలు..
సంతోషంలో నా పెదవులపై నిలిచే  చిరునవ్వులు..
బాధలో నా కంటి నుండి జారే చిన్ని చినుకులు..
నా చుట్టూ ఉన్న మనుషుల  ప్రేమ,అభిమానం అసూయ,ద్వేషాలు..
జయాపజయాలు , పొగడ్తలు, అభినందనలు, అవమానాలు 

అన్నిటిని తనలో ఇముడ్చుకుని  ప్రతి రోజూ ఒక  కొత్త పాఠాన్ని నేర్పుతూ, 

ఎప్పుడూ నన్ను వదలకుండా నాతో ఉండే "నా చిన్నిప్రపంచం" నాకు చాలా ఇష్టం.

" నా చిన్నిప్రపంచం " నాకు కేవలం బ్లాగ్ మాత్రమే  కాదు .. 
నా ప్రియనేస్తం.. నా అంతరంగానికి అక్షర రూపం.
" నా చిన్నిప్రపంచం " పేరుకే చిన్నది కానీ ఎల్లలు లేనిది ... మంచి స్నేహితులను, వ్యక్తులను , కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. 
లోకాన్ని , మనుషుల ప్రవర్తనలను బ్లాగ్ ల ద్వారా కూడా చూసే అవకాశం  కల్పించింది.ఈ నెట్ ప్రపంచంలో నా పేరుకు  ఒక గుర్తింపును తెచ్చింది.

ఇన్నేళ్ళ నా బ్లాగ్ ప్రయాణంలో నేను ఏదో సాధించానని చెప్పను, కానీ నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి..నెట్ ప్రపంచం అయినా బయటి ప్రపంచం అయినా ఎదుటి వాళ్ళ  మనోభావాలు, ఆలోచనలు మనకి నచ్చినా  నచ్చక పోయినా వారి అభిప్రాయాలను గౌరవిస్తే చాలు, ఇతరులను జడ్జ్ చేసే ముందు మన అర్హత ఏమిటో కూడా తెలుసుకుంటే మంచిది అన్న విషయాన్నీ ఎప్పుడూ గుర్తుంచుకుంటాను...

" నా  చిన్నిప్రపంచాన్ని"  ఈ  ప్రపంచానికి పరిచయం చేసి  ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయ్యింది.నాకు చాలా ఇష్టమైన "నా చిన్నిప్రపంచం"  పుట్టినరోజు ఈ రోజు...


 నా చిన్నిప్రపంచానికి ఎప్పుడూ వస్తూ నా ఆలోచనలను, భావాలను మెచ్చుకుని అభినందించే మిత్రులకు,అప్పుడప్పుడు వచ్చి, నా చిన్నిప్రపంచంలో కనిపించే బ్లాగర్లకు అందరికీ "నా చిన్నిప్రపంచం" పుట్టినరోజు సందర్భంగా కృతఙ్ఞతలు ...

  

5, మే 2012, శనివారం

మా తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...


"బంధం విలువ రక్త సంబందానికే తెలుస్తుంది" అన్న మాటని నిజం చేస్తూ
తోడబుట్టినందుకు తోడుగా నిలుస్తూ
బాధలో ... సంతోషంలో, కష్టం లో ... సుఖంలో
చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా నా ప్రతి అడుగులోనూ తోడుంటూ,
ఎప్పడైనా, అవసరమైనా నాకు నా తమ్ముడున్నాడు అన్న ధైర్యాన్ని కలిగించే
నీ ప్రేమాభిమానాలు నాకు భగవంతుడు అందించిన ఒక అదృష్టం...

ఈ అదృష్టం ఎప్పుడూ ఇలాగే వుండాలని,నాకు,చెల్లికి ఎప్పటికీ నువ్వొక అండగా
నిలవాలి అని కోరుకుంటూ ...
భగవంతుడు నిన్ను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి,నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని
నిత్యనూతనంగా తీర్చిదిద్దాలని,నువ్వు కోరుకునే ప్రతి కోరికా నెరవేరాలని,
సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ
నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడూ..

Wish you a very happy birthday
May life lead you to great happiness success and hope
That all your wishes comes true!
enjoy your day.

Happy BirthDay
Many
Happy Returns Of The Day

ఎప్పటికీ నీ ప్రేమాభిమానాలను,నీ క్షేమాన్ని కోరుకునే
నా
(మన) చిన్నిప్రపంచం..




23, మార్చి 2012, శుక్రవారం

అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు...



నిద్రలో ఉలిక్కిపడి లేచినప్పుడు తన నిద్రమానుకుని నన్ను జోకొట్టి నిద్రపుచ్చింది..
కలల ఊయలలో నన్ను మెల్ల మెల్లగా ఊపింది..

ఎలాంటి
పరిస్థితిలోనైనా నీకు నేనున్నానని స్నేహపూరితంగా
నాకు ధైర్యం చెప్పింది..

బాధని తట్టుకునే ధైర్యంలేని నా మనసు కన్నీరుగా మారినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని
నా కన్నీటిని తన చీర చెంగుతో తుడిచింది..

తనని విసిగించే పనులు చేసి మనశ్శాంతి లేకుండా చేసినా భరిస్తుంది.
అర్ధంలేకుండా నేను కోప్పడినా అర్ధం చేసుకుంటుంది..

మొత్తం ప్రపంచం మీద అలిగి నేను కోపంగా నిద్రపోయినప్పుడు నెమ్మదిగా
దుప్పటి కప్పి,తన కొంగులో నన్ను దాచుకుంటుంది..

మొదటి గురువుగా జీవిత పాఠాల్ని నేర్పుతుంది
పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ కీ తను తీసిపోను అంటుంది.

రెక్కలొచ్చి మనం ఎగిరిపోయినప్పుడు మన ఉన్నతికి గర్విస్తుంది
తన గూటిలోనే తను ఉండిపోతుంది..

అమ్మంటే సృష్టి, అమ్మంటే సహనం, అమ్మంటే త్యాగం, అమ్మంటే ప్రేమ
"అమ్మ వంటిది ... అంత మంచిది అమ్మ ఒక్కటే"


ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మను భగవంతుడు
ఆయురారోగ్యాలతో
దీవించి, కాపాడాలని,
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..
అమ్మకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


"నా
చిన్నిప్రపంచం
"






11, ఫిబ్రవరి 2012, శనివారం

నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు...!


కొత్త
కొత్త విషయాలను తెలుసుకుంటూ,
మంచి బ్లాగ్ మిత్రులు,బ్లాగర్ల పరిచయంతో
సరదాగా
,సంతోషంగా సాగిపోతున్న "నా చిన్నిప్రపంచం" ప్రయాణం
మొదలై ...ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.



2, డిసెంబర్ 2011, శుక్రవారం

నా పుట్టినరోజు ...

ఈ రోజు నా పుట్టిన రోజు..
నా చిన్నిప్రపంచంలో అందరు ఇష్టపడి, ప్రేమించే రాజి పుట్టినరోజు..
మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు వున్న వాళ్ళు అదృష్టవంతులట
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిననే చెప్పొచ్చు..
అందరి దీవెనలు,అభినందనలతో ఈ రోజు మొదలయ్యింది..
Happy BirthDay ... Raaji.
Many Many Happy Returns Of The Day


"I thank God for allowing me to
experience the many joys of life,
by giving me the opportunity to
love and be loved by other people."

నాకు నా బ్లాగ్ ఫ్రెండ్ 'సుభా' గారు ఇచ్చిన పుట్టినరోజు కానుక
Thankyou My Dear Friend



27, సెప్టెంబర్ 2011, మంగళవారం

Happy BirthDay Dear Ramya..

My Dear Sister Ramya

W
ishing you a Day
Packed With loads Of Gifts
Sunny Smiles & Lots Of Love
Hope You Have A Very

Happy
BirthDay
Many Many Happy Returns Of The Day

31, జులై 2011, ఆదివారం

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు...


ఈ రోజు నా మేనకోడలు చిన్నారి పింకీ - దేవీప్రియ మొదటి పుట్టినరోజు..
నా చిన్ని మేనకోడలిని భగవంతుడు ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలతో దీవించి,కాపాడాలని దేవుడిని ప్ర్రార్ధిస్తూ
తాతయ్య,నానమ్మ,అమ్మ,నాన్న,మామయ్యలు,అత్తయ్యలు అందరి తరపున నా( మన ) చిన్నిప్రపంచం
నీకు
హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుంది పింకీ ...

Happy 1st BirthDay
Many Happy Returns Of The Day




24, జులై 2011, ఆదివారం

Happy BirthDay భద్ర...


ఈ రోజు నా చిన్నిప్రపంచంలో కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యుడు,మాఇంటి చిన్నఅల్లుడు,మా చెల్లి రమ్య భర్త,
మా
మరిదిగారు వీరభద్ర పుట్టినరోజు..
ఎంతో కష్టపడి,జీవితంలో తను అనుకున్నది సాధించి తనకిష్టమైన పోలీస్ డిపార్ట్ మెంట్ లో S.I Of Police గా
విధులు నిర్వర్తిస్తున్న మా మరిదిగారు త్వరలోనే మరింత వున్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ..
మా చెల్లిని,మరిది గారిని తన చల్లని చూపులతో ఎల్లవేళలా కాపాడాలని,వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ

నా చిన్నిప్రపంచం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు...

A Birthday is A Million Moments
Each holding A Promise Of Fulfillment Of UR Dreams &

ACCOMPLISHMENTS Of Some Special Plans...


Wish U A Very Happy BirthDay
Many Many Happy Returns Of The Day


5, మే 2011, గురువారం

ప్రియమైన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు...



దేవుని దీవెనలతో
అమ్మా నాన్నల ఆశీస్సులతో
కుటుంబ సభ్యుల ఆప్యాయత,అనురాగంతో
ప్రతినిత్యం నవ్వులు పంచే క్షణాలతో...
నీ కలలు కోరికలు అన్నీ నెరవేరాలని...
ఇలాంటి
సంతోషకరమైన పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ
పుట్టినరోజు
శుభాకాంక్షలు తమ్ముడూ...

Let the GOD decorate each GOLDEN RAY OF THE SUN
reaching u with
wishes of Success, Happiness,health,
wealth and prosperity For you ,

Wish you Happy Birthday.
Wish you a many many happy returns of the day VAMSI.





4, ఏప్రిల్ 2011, సోమవారం

Happy BirthDay అమ్మా...


అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు


Happy BirthDay అమ్మా ...
నువ్విలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని,
భగవంతుడు నిన్ను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవించి
నువ్వు మా మీద పెట్టుకున్న కలలు, కోరికలు అన్నీ నిజమయ్యేలా దీవించాలని ప్రార్ధిస్తూ...

You made me dream...
You made me live my dream.

You are an inspiration.

You are the reason for what i am.


you ask for nothing...

But have given me everything.

I would like to tell this

from the bottom of my heart...


I love you so much mom!

Wish you a very Happy BirthDay


నా చిన్నిప్రపంచం...


Related Posts Plugin for WordPress, Blogger...