పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
మా ఇల్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మా ఇల్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2018, ఆదివారం

Flowers In Daily Life - Making Memories with Flowers



Flowers In Daily Life - Making Memories with Flowers 
పువ్వులంత అందమైన జ్ఞాపకాలు





10, అక్టోబర్ 2015, శనివారం

ఆగమనం

జీవితమనే పూలతోటలో కొందరి ఆగమనం వసంతమైతే మరికొందరి ఆగమనం గ్రీష్మం ..

ఎవరి ఆగమనం వసంతంలా జీవితాన్ని పచ్చని తోటగా,వికసించిన పుష్పాలతో రమణీయంగా మారుస్తుందో,ఎవరి ఆగమనం జీవితాన్ని గ్రీష్మ తాపంతో ఎండిన మోడులా చేస్తుందో తెలపాల్సింది కాలమే అయినా ఇలాంటి విషయాలన్నీ ముందుగానే తెలుసుకునే శక్తి మనిషికి ఉంటే బాగుంటుంది కదా ..!!

ఒక గ్రీష్మ ఆగమనానికి ముందు మా ఇంటి పూలతోట












29, ఆగస్టు 2014, శుక్రవారం

మా ఇంటి వినాయకుడు


సంతోషంగా మా ఇంటికి వచ్చి  పూజలందుకున్న బొజ్జ గణపయ్య తన కరుణా కటాక్షాలతో, చల్లని చూపులతో అందరినీ కాపాడాలని కోరుకుంటూ.. 

వినాయకచవితి శుభాకాంక్షలు 








23, జనవరి 2013, బుధవారం

కొత్త సంవత్సరం లో కొత్త కొత్తగా ...



కొత్త సంవత్సరం కొత్త కొత్తగా ...వచ్చేసింది  చిన్న చిన్నగా  పాతపడిపోతుంది కూడా.. కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా ఎప్పుడూ ప్రత్యేకమే, ప్రతిసారీ పండగే. పాత సంవత్సరం వెళ్ళిపోతూ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ఎంతో ఉత్సాహం, ఎన్నో వేడుకలు ... కొత్త సంవత్సర సంబరాల్లో నాకు బాగా నచ్చేవిషయం రాబోయే సంవత్సరం మంచి చేయాలని  ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవటం, మనకు,మన వాళ్లకు  ఈ సంవత్సరం ఆనందంగా,శుభంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా బావుంటుంది. ఒక గతం గడిచిపోయింది, అది కలిగించిన బాధలను, ధుఃఖాలను ఇక్కడే మర్చిపోయి, కొత్త తలపులతో, సరికొత్త ఆశలతో అందమైన భవిష్యత్తు కోసం నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాం ... 

కొత్తసంవత్సరం లో నాకు ఎక్కువగా నచ్చేది కొత్త డైరీలు,గ్రీటింగులు మనం మన  వాళ్లకి ఇచ్చినా,మనవాళ్ళ నుండి మనం అందుకున్నా చాలా సంతోషంగా అనిపించే వాటిలో ఈ డైరీలు,గ్రీటింగులు ఫస్ట్ ప్లేస్ లో వుంటాయి.న్యూ ఇయర్ వస్తుందనగానే షాపింగ్ లిస్టులోకి ఈ డైరీలు కూడా చేరిపోతాయి. నాకు మాత్రం ప్రతి సంవత్సరం మా తమ్ముడు ఇచ్చే డైరీ,కొత్త పెన్ తోనే  సంవత్సరం మొదలవుతుంది.. ఆస్వాదించిన అనుభూతులను, బాధపెట్టిన చేదు జ్ఞాపకాలను, గడిచిపోయిన కాలాన్ని పదిలంగా దాస్తూ ,రాబోయే కాలానికి ఆహ్వానంగా మంచి డైరీని అందుకోవటం సంతోషంగా అనిపిస్తుంది.కొత్త డైరీ చూడగానే చిన్నప్పుడు స్కూల్ రీఓపెన్ కాగానే కొత్తపుస్తకాలు  కొనుక్కుని,జాగ్రత్తగా అట్టలు వేసుకుని, కొన్నాళ్ళ పాటు భద్రంగా దాచుకునే రోజులు గుర్తొస్తాయి. 

ఇంకా కొత్త సంవత్సరంలో కొత్తగా ఇంట్లో చేరేవాటిలో కేలండర్లు కూడా ముఖ్యమైనవే..ఏ షాప్ కి వెళ్ళినా వాళ్ళ షాప్ పేరుతో  ప్రింట్ చేయించి ఇచ్చే కాలెండర్లు,అలాగే ఈనాడు,సాక్షి,స్వాతి వాళ్ళు ఇచ్చే కాలెండర్లు ఇంట్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి.ఒకప్పుడైతే కేలండర్లను గోడలకు తగిలించే వాళ్ళు  కానీ  ఇప్పుడలా కాదు..అవసరమైనప్పుడు తిథిలు, ముహూర్తాలు, పంచాంగం చూడటం కోసం బుక్ రాక్ లో నుండి  వెతికి తెచ్చుకోవటమే..

ఇలా కొత్త సంవత్సరంతో పాటూ చాలా కొత్త కొత్త వస్తువులు,విషయాలు జీవితంలోకి చేరుతుంటాయి.. కాలంతో పాటూ పాతపడుతుంటాయి..ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త వస్తువులు,కొత్త పనులు,కొత్త బంధాలు,బాధ్యతలు కొత్త సంతోషాలు,కొత్త సమస్యలు,సవాళ్లు ఇలా జీవితం కొత్త కొత్తగా సాగిపోతుంది... 

ఈ సంవత్సరం నా చిన్నిప్రపంచంలో నాకు నచ్చిన కొన్ని కొత్త విశేషాలు...


ఈ కొత్త సంవత్సరం లో సంక్రాంతి అయిపోగానే శ్రీశైలం వెళ్ళటం చాలా సంతోషంగా అనిపించింది. శ్రీశైలం వెళ్ళగానే సాయంత్రం దర్శనం, ఉదయం పూజలు అన్నీ బాగా జరిగాయి.

 శ్రీశైలం లో స్వామివారికి,అమ్మవారికి చేయించిన 
అభిషేకం,కుంకుమ పూజ ప్రసాదాలు..


అక్షరాలై నిలవబోయే అనుభవాలు 
 కొత్త డైరీలు


కాలప్రవాహంలో రోజుల్ని దాటుకుంటూ 
ముందుకు సాగిపోయే కాలెండర్లు 


శ్రీశైలం శిఖరం దగ్గర ఉండే "రాజా షాపింగ్ సెంటర్" మాకు చాలా నచ్చే షాప్.ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. పెర్ఫ్యూమ్స్,సోప్స్ ,బ్యూటీ ప్రొడక్ట్స్,మంచి మ్యూజిక్ కలెక్షన్ సి డి లు,పిల్లల ఇంపోర్టెడ్ ఆట వస్తువులు ఇలా ఇక్కడ షాపింగ్ మాకు చాలా ఇష్టం, ఈసారి తీసుకున్న వాటిలో 
వెరైటీ సోప్ బాక్స్ ల్లో ఉన్న బాత్ సోప్స్, 
చామ్ రాజ్ టీ బాక్స్ కొత్తగా అనిపించాయి..


మా బృందావనం లో ఈ కొత్త సంవత్సరం కొత్తగా 
పూచిన పువ్వులు,కాయలు..





14, డిసెంబర్ 2012, శుక్రవారం

కార్తీకమాసం - మా సత్యనారాయణస్వామి వ్రతం





హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసంలో మేము చేసుకున్న 
సత్యనారాయణ స్వామివ్రతం 

శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
 నోచిన వారికి నోచిన వరము
చూసిన వారికి చూసిన ఫలము



 

 





శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా





24, నవంబర్ 2012, శనివారం

మా చిన్నిప్రపంచానికి యువరాజు ...



అక్టోబర్ -22- 2012  దుర్గాష్టమి... అందరూ  దుర్గాష్టమి పూజల  సందడిలో ఉంటే  మాకు మాత్రం విపరీతమైన టెన్షన్.మా చెల్లికి డెలివరీ టైం ఉదయం నుండి మొదలైన మా టెన్షన్ సాయంత్రం 5.24 కు మా చేతిలోకి చిన్నారి బాబును అందుకుని,ఆ తర్వాత మా చెల్లి క్షేమంగా మాట్లాడటం చూసేదాకా కంటిన్యూ అయ్యింది..కొన్ని పరిస్థితుల్లో ఎంత తప్పదు  అని తెలిసినా భయపడటం,బాధపడటం మానవ సహజం అనుకుంటాను.


 బాబును చూడగానే అప్పటిదాకా మేము పడిన బాధ,భయం అన్నీ మాయం అయినట్లయింది ..బాబు నాన్నగారికి,బంధువులకి అందరికీ విషయం చెప్పేసి,అందరి అభినందనలు అందుకుని, అప్పటి నుండి ఇప్పటిదాకా చెల్లిని,బాబుని కేర్ తీసుకునే విషయంలో  నెలరోజులు ఎలా గడిచిపోయిందో  కూడా తెలియలేదు.నా చిన్ని ప్రపంచానికి యువరాజు,
మా చెల్లి,మరిది గారి ప్రేమకు ప్రతిరూపం, మా బుజ్జి బుజ్జాయి,చిన్నారి చందమామ రాకతో మా బొమ్మరిల్లు ఆనందాల హరివిల్లుగా మారిపోయింది... 


వింత వింత హావభావాలతో, తన చిన్ని చిన్ని కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న మా  చిన్నారి పేరు "జయాదిత్య". జన్మనక్షత్రం ప్రకారం ఆ పేరు పెట్టాము.శివుడికి ఇష్టమైన సోమవారం,అమ్మవారి దుర్గాష్టమి రోజున శివపార్వతుల కానుకగా  వచ్చిన మా బుజ్జాయికి నేను పెట్టుకున్న ముద్దు పేరు కుమార స్వామి.. ఇంకా ఎన్నెన్నో ముద్దు పేర్లు.. ఎవరికి  ఎప్పుడు ఎలా నచ్చితే అలా పిలవటం  :) ఇవండీ ప్రస్తుతానికి మా బుజ్జి కుమారస్వామి కబుర్లు.. ఇంకా మరెన్నో కబుర్లున్నాయి..

మా చిన్నారి జయాదిత్యను  భగవంతుడు  తన చల్లని  ఆశీస్సులతో  కాపాడి,ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో దీవించాలని ప్రార్ధిస్తూ.. అమ్మా,నాన్నలయిన మా చెల్లి,మరిది గారు భద్ర,రమ్య లకు 
నా చిన్నిప్రపంచం తరపున హృదయపూర్వక అభినందనలు... 

మా చిన్నారి "జయాదిత్య" కు "నా చిన్నిప్రపంచం" ఫ్రెండ్స్ కూడా 
మీ  దీవెనలను అందించమని కోరుకుంటున్నాను.


Dear Ramya, Bhadra

 Congratulations on one of your best moments in life. 
May this little parcel of joy bring 
prosperity, joy and luck to you. 

 May your new little one grow strong, 
wealthy and wise. 
Congratulations for the new baby! 
చిన్ని  తండ్రీ నిను చూడగా 
వేయి కళ్ళైన సరిపోవురా 
 అన్ని కళ్ళూ చూస్తుండగా 
నీకు దిష్టెంత దిష్టెంత తగిలేనురా 
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా..




10, మే 2012, గురువారం

మా పావురాల ప్రేమ ఊసులు ...


మా ఇంటి దగ్గర పావురాలు మాకు అతిధులు..మేము పిలవకపోయినా వచ్చి ఇంటి చుట్టూ సందడి చేస్తుంటాయి.ఈ ఎండకి మా బాల్కనీ,స్లాబ్ గట్లు ,విండో లు వాటికి స్థావరాలు.. ఆ పావురాల్ని చూడటం, ఫోటోలు తీసుకోవటం నాకు సరదా ఐతే... ఇల్లు చుట్టు పక్కలంతా శుభ్రం చేయటానికి మా భారతమ్మకు మహా కష్టం..
ఏంటమ్మా వాటిని కొట్టనివ్వవు ఇల్లంతా పాడు చేస్తుంటే అని తెగ బాధ పడిపోతుంది..

ఒక పావురం ముందుగానే వచ్చి మరో పావురం కోసం ఎదురు చూస్తూ కూర్చుని, తను ఎదురుచూస్తున్న పావురం రాగానే ముచ్చట్లు,ఆలస్యంగా వచ్చిందని అలకలు..
ఎప్పుడూ ప్రేమికులకు ప్రేమ సందేశాల్ని అందించే పావురాలు తమ మనసులోని ప్రేమ గురించి చెప్పుకుంటున్న ఊసులు ... ఫొటోలతో పాటూ నాకు"నచ్చిన" ... "వచ్చిన కాదు" :) కవిత కూడా ...

మా పావురం ఎదురుచూపులు - కవిత్వాలు


ఎన్నాళ్ళు ప్రియా నా ఎదురుచూపులు
మనసూ మనసుకు మధ్య మరచిపోలేని మమతానురాగాలు
మరువగలవా ప్రియా ?? మరపురాని సంఘటనలు
ఎందుకు ప్రియా ఆకాశానివై అందనంటావు??


ఎండమావివై దొరకనంటావు ...
పాద రసమై పట్టుబడనంటావు...
కలువపువ్వువై నన్ను కవ్వించరావా ...
మల్లె తీగవై నన్ను అల్లుకోవా?


కంటిలో కనుపాపలా నాలో కలిసిపోవా
చీకటిలో చిరు వెలుగువై రావా..
చినుకులా నా మీద పడి నా కౌగిలిలో కరిగిపోవా
కల అనుకున్న నా జీవితాన్ని నిజం చేయలేవా !!!


7, ఏప్రిల్ 2012, శనివారం

ప్రయాణ సాధనములు ... వివిధ రకములు...!


ఒక పని లేని మధ్యాహ్నం నెట్ లో,బ్లాగుల్లో తిరిగీ తిరిగీ విసిగి పోయి,అలసి పోయి అలా చల్లగాలికి
కూర్చుందామని మా బాల్కనీలో కూర్చున్నాను..
అక్కడ కూర్చుని రోడ్డున వస్తున్న వివిధ రకాల వాహనాలను చూడగానే, ఒక ఆలోచన వచ్చింది.
అంతే... వెంటనే కెమేరా తెచ్చుకుని, వాళ్ళందరినీ నా కెమెరాలో,ఆ తర్వాత ఇప్పుడు
నా
చిన్ని ప్రపంచంలో బంధించేస్తున్నాను..
















Related Posts Plugin for WordPress, Blogger...