పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, ఏప్రిల్ 2012, శనివారం

ప్రయాణ సాధనములు ... వివిధ రకములు...!


ఒక పని లేని మధ్యాహ్నం నెట్ లో,బ్లాగుల్లో తిరిగీ తిరిగీ విసిగి పోయి,అలసి పోయి అలా చల్లగాలికి
కూర్చుందామని మా బాల్కనీలో కూర్చున్నాను..
అక్కడ కూర్చుని రోడ్డున వస్తున్న వివిధ రకాల వాహనాలను చూడగానే, ఒక ఆలోచన వచ్చింది.
అంతే... వెంటనే కెమేరా తెచ్చుకుని, వాళ్ళందరినీ నా కెమెరాలో,ఆ తర్వాత ఇప్పుడు
నా
చిన్ని ప్రపంచంలో బంధించేస్తున్నాను..
















17 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఇన్ని సాధనాలలొ ప్రయాణించి మీ ఇంటికి చేరుకున్నం. హమ్మయ్య చెప్పకుండా వచ్చినా.. గేటు తీసి ఆహ్వానించారు. ధన్యవాదములు రాజీ గారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ...
చెప్పకుండా వచ్చినా.. మీరు మా ఆత్మీయ అతిధి కదండీ!
అందుకే ఆత్మీయంగా ఆహ్వానించాను.
నా ఆహ్వానాన్ని మన్నించినందుకు ధన్యవాదములు..

రసజ్ఞ చెప్పారు...

భలే ఉన్నాయి! గూడు రిక్షా, ఏండ్ల బండి, గుఱ్ఱపు బండి నాకెంతో ఇష్టం. అవి పెట్టలేదు హు హు హు :'(

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారూ..
ప్రయాణ సాధనాలు నచ్చినందుకు థాంక్సండీ!
"గూడు రిక్షా, ఎడ్ల బండి, గుఱ్ఱపు బండి"
ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలుగా అయ్యాయి...
పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అవి అంతగా కనిపించటం లేదనుకుంటాను :)

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

హహహ బాగుంది.. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు అండి.. పరదేశ్ మూవీ లాగా మీకు ఇంటికి చుట్టూ పొలాలు పంట చేలు ఉంటాయా అండి..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"తెలుగు పాటలు" గారూ.. భలే చెప్పారండీ!
నిజంగానే మా ఇంటి చుట్టూ పరదేశ్ మూవీలో లాగా పంట పొలాలు,తోటలు ఉండేవి..
ఉద్యోగ రీత్యా మేము ఒక రూరల్ ఏరియాలో వున్నప్పుడు..
పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ..

జలతారు వెన్నెల చెప్పారు...

రాజి గారు..ఇప్పుడు రిక్షాలు లేవా ఇండియా లో?
అయినా మీరు భలే గా దారిన వచే పొయే వాహనాల photos తీసేసి పోస్ట్ రాసేసారండి!
Title కూడా భలే నచ్చిందండి నాకు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జలతారు వెన్నెల" గారూ..
నేను పనిలేక చేసిన పని మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ..
అలాగే Title నచ్చినందుకు థాంక్యూ!
మీరు భలే వారండీ ఇండియాలో రిక్షాలు లేకపోవటమా??
ఇంతకు ముందు రసజ్ఞ గారు అడిగారు, ఇప్పుడు మీరు అడిగారు రిక్షా గురించి.
ఈసారి తప్పకుండా రిక్షా ఫోటో తీస్తానులెండి
మీ కోసమైనా :)

జలతారు వెన్నెల చెప్పారు...

Thank you !

జయ చెప్పారు...

బాగున్నాయ్ రాజి. చిన్నప్పుడు సైకిల్ అంటే చాలా ఇష్టపడే దాన్ని. మా అమ్మమ్మ గారి ఊర్లో బస్ దిగాక చక్కటి గూడుతోటి ఎడ్ల బండి లో వెళ్ళే వాళ్ళం. మా మామయ్య ట్రాక్టర్ మీద కూడా తీసుకుపోయేవాడు.నాగార్జున సాగర్ లో జీప్ లు ఎక్కేవాళ్ళం. కారులు, ఆటోలు ఇప్పుడు బాగానే ఎక్కుతున్నాను:} గుంటూరు రిక్షాలు బాగుంటాయి కదూ. ఇంతకి మీ ఇంటికి ఏమి ఎక్కి రావాలబ్బా నేను!!! నెం.11 బండి మాత్రం ఎక్కనమ్మ:)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జయ" గారూ.. ప్రయాణ సాధనాలు నచ్చినందుకు థాంక్సండీ..
నాకు కూడా చిన్నప్పుడు సైకిల్ అంటే చాలా ఇష్టం..
నిజమేనండీ గుంటూరు,విజయవాడలో రిక్షాలు బాగుంటాయి..
నేను విజయవాడలో లా చదివేటప్పుడు రిక్షానే
నా ప్రయాణ సాధనం.
ఎందుకంటే ఆటోలంటే భయం అప్పట్లో నాకు :)
ఐతే మీకు 11 నెంబర్ బండి తప్ప అన్నీ నచ్చాయన్న మాట..
మా ఇంటికి మీరు 15 నెంబర్ క్వాలిస్ లో వద్దురుగాని :)

శశి కళ చెప్పారు...

బాగున్నాయి రాజి గారు మీ ఫోటోలు...మీరు లాయరా?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శశి కళ" గారూ..
ఫోటోలు నచ్చినందుకు థాంక్సండీ...
చాలా రోజుల తర్వాత మమ్మల్ని పలకరించారు బాగున్నారా??
అవునండీ నేను లాయర్నే..

మాలా కుమార్ చెప్పారు...

మీ ఇంటి చుట్టూ ఎంచక్కా ఖాళీ జాగా వుందండి . ప్రయాణ సాధనాలన్నీ ఫొటోలు తీసారు .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మాలా కుమార్" గారూ..
మా వారు రూరల్ ఏరియాలో డాక్టర్ గా వర్క్ చేసినప్పుడు నిజంగా ఆ చుట్టుపక్కల పరిసరాలు చాలా బాగుండేవి..
అక్కడ తీసిన ఫోటోలే ఇవన్నీ..

జ్యోతిర్మయి చెప్పారు...

మీ బాల్కనీలో కూర్చిని టీ తాగుతూ మీతో పాటు వాహనాలను చూస్తున్నట్టుగా ఉంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ జ్యోతిర్మయి గారూ..
నిజంగా సాయంత్రం అక్కడ బాల్కనీలో కూర్చుని టీ తాగుతూ అందరినీ చూస్తూ కూర్చోవటం చాలా ఇష్టమైన పని నాకు మేము అక్కడ వున్నప్పుడు..

కానీ మార్పు అనివార్యం కదండీ అలాగే అక్కడినుండి మారిపోయాము ఇప్పుడు..
ఇప్పటికీ అక్కడి ఫోటోలు చూస్తుంటే నా మనసు కూడా మీలాగే అక్కడికి వెళ్ళిపోతుంది..

Related Posts Plugin for WordPress, Blogger...