
సమ్మర్ లో మాత్రమే దొరికే వాటిలో మాకు ఇష్టమైనవి తాటి ముంజలు..
తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు మీదపడకుండా తినటం ఒక సరదా..
ఈ సారి మా సమ్మర్ స్పెషల్ ట్రీట్ గా మా మరిదిగారు ( భద్ర ) తాటి ముంజలు తెచ్చారు.
వాళ్ళ వూరి దగ్గర చాలా తాటి చెట్లు ఉంటాయట..
మాకు ఇక్కడ మంచివి దొరకవని ప్రత్యేకంగా అక్కడి వాళ్ళతో
అప్పటికప్పుడు కొట్టించి,తంగేడు ఆకులతో భద్రపరచి జాగ్రత్తగా తీసుకువచ్చారు..
ఎప్పుడూ బజార్లో దొరికే తాటి ముంజలు బాగున్నా,బాగుండక పోయినా తినాలన్న ఇష్టంతో తినే మాకు
అప్పటికప్పుడు ఫ్రెష్ గా, లేతగా, మెత్తటి గుజ్జుతో వున్న తాటి ముంజలు చాలా నచ్చాయి.
ఈ సమ్మర్ లో ఇది నిజమైన సమ్మర్ స్పెషల్...

