శ్రీకారం చుడుతున్నట్లు..కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చుస్తున్నాయే..మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్లు…రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు… దాకుందే బంగరు బొమ్మ
నక్షత్రాలెన్నంటూ..లెక్కెడితే ఏమయినట్లు
నీ మనసుకు రెక్కలు కట్టు.. చుక్కల్లో విహరించేట్లు
ఎక్కడ నా వెలుగంటూ.. ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ.. నిద్దురనే వెలి వేయొద్దు
వేకువనే లాక్కొచ్చేట్లు .. వెన్నెలనే దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ.. తక్షణమే హాజరయేట్టు
నళినివో ... హరిణివో ... తరుణీవో... మురిపించే ముద్దుల గుమ్మ..
http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html