పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, నవంబర్ 2012, శనివారం

మా చిన్నిప్రపంచానికి యువరాజు ...అక్టోబర్ -22- 2012  దుర్గాష్టమి... అందరూ  దుర్గాష్టమి పూజల  సందడిలో ఉంటే  మాకు మాత్రం విపరీతమైన టెన్షన్.మా చెల్లికి డెలివరీ టైం ఉదయం నుండి మొదలైన మా టెన్షన్ సాయంత్రం 5.24 కు మా చేతిలోకి చిన్నారి బాబును అందుకుని,ఆ తర్వాత మా చెల్లి క్షేమంగా మాట్లాడటం చూసేదాకా కంటిన్యూ అయ్యింది..కొన్ని పరిస్థితుల్లో ఎంత తప్పదు  అని తెలిసినా భయపడటం,బాధపడటం మానవ సహజం అనుకుంటాను.


 బాబును చూడగానే అప్పటిదాకా మేము పడిన బాధ,భయం అన్నీ మాయం అయినట్లయింది ..బాబు నాన్నగారికి,బంధువులకి అందరికీ విషయం చెప్పేసి,అందరి అభినందనలు అందుకుని, అప్పటి నుండి ఇప్పటిదాకా చెల్లిని,బాబుని కేర్ తీసుకునే విషయంలో  నెలరోజులు ఎలా గడిచిపోయిందో  కూడా తెలియలేదు.నా చిన్ని ప్రపంచానికి యువరాజు,
మా చెల్లి,మరిది గారి ప్రేమకు ప్రతిరూపం, మా బుజ్జి బుజ్జాయి,చిన్నారి చందమామ రాకతో మా బొమ్మరిల్లు ఆనందాల హరివిల్లుగా మారిపోయింది... 


వింత వింత హావభావాలతో, తన చిన్ని చిన్ని కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న మా  చిన్నారి పేరు "జయాదిత్య". జన్మనక్షత్రం ప్రకారం ఆ పేరు పెట్టాము.శివుడికి ఇష్టమైన సోమవారం,అమ్మవారి దుర్గాష్టమి రోజున శివపార్వతుల కానుకగా  వచ్చిన మా బుజ్జాయికి నేను పెట్టుకున్న ముద్దు పేరు కుమార స్వామి.. ఇంకా ఎన్నెన్నో ముద్దు పేర్లు.. ఎవరికి  ఎప్పుడు ఎలా నచ్చితే అలా పిలవటం  :) ఇవండీ ప్రస్తుతానికి మా బుజ్జి కుమారస్వామి కబుర్లు.. ఇంకా మరెన్నో కబుర్లున్నాయి..

మా చిన్నారి జయాదిత్యను  భగవంతుడు  తన చల్లని  ఆశీస్సులతో  కాపాడి,ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో దీవించాలని ప్రార్ధిస్తూ.. అమ్మా,నాన్నలయిన మా చెల్లి,మరిది గారు భద్ర,రమ్య లకు 
నా చిన్నిప్రపంచం తరపున హృదయపూర్వక అభినందనలు... 

మా చిన్నారి "జయాదిత్య" కు "నా చిన్నిప్రపంచం" ఫ్రెండ్స్ కూడా 
మీ  దీవెనలను అందించమని కోరుకుంటున్నాను.


Dear Ramya, Bhadra

 Congratulations on one of your best moments in life. 
May this little parcel of joy bring 
prosperity, joy and luck to you. 

 May your new little one grow strong, 
wealthy and wise. 
Congratulations for the new baby! 
చిన్ని  తండ్రీ నిను చూడగా 
వేయి కళ్ళైన సరిపోవురా 
 అన్ని కళ్ళూ చూస్తుండగా 
నీకు దిష్టెంత దిష్టెంత తగిలేనురా 
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా..
Related Posts Plugin for WordPress, Blogger...