శ్రీ మహిషాసురమర్దనీ దేవి - 23 - 10 - 2012
ఆశ్వయుజ నవమి - మహర్నవమి
తొమ్మిదోరోజైన ఆశ్వయుజనవమి నాడు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దనిగా అలంకరిస్తారు.
శరన్నరాత్రులలో చివరిరోజు నవమి. దీనినే మహర్నవమి అంటారు. దుర్గాదేవి అష్ట
భుజాలతో, దుష్ట రాక్షసుడైన మహిషాసురుడ్ని చంపి లోకాలన్నింటికీ మేలు
చేసింది.
మహిషాసురమర్దనీ దేవి సింహ వాహనం మీద ఒక చేత త్రిశూలం తో మహిషాసురుడ్ని
సంహరిస్తున్న రూపంలో దర్శనం ఇస్తుంది.
‘అపర్ణా చండికా చండమండాసుర నిఘాదినీ’
అయిగిరి నందిని నందిత మేదిని
విశ్వవినోదిని
నందినుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని
విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే
శితికంఠకుటుంభిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్ధిని