నేను కుడా తెలుగు బ్లాగ్ వ్రాయాలన్న ఉత్సాహంతో మొదలుపెట్టిన నా చిన్నిప్రపంచం లో 100 పోస్ట్ లు పూర్తి చేశాను.
నా అభిరుచులను ,నా చిన్నిప్రపంచంలోని సరదాసంతోషాలను అందరితో పాటు, నాతో నేను పంచుకుంటూ సాగిస్తున్న
నా బ్లాగ్ ప్రయాణంలో నేను సృష్టించుకున్న నా బ్లాగుల ప్రపంచం..
సరిగమలు...గలగలలు ... నా సంగీతప్రపంచం నా అభిరుచులను ,నా చిన్నిప్రపంచంలోని సరదాసంతోషాలను అందరితో పాటు, నాతో నేను పంచుకుంటూ సాగిస్తున్న
నా బ్లాగ్ ప్రయాణంలో నేను సృష్టించుకున్న నా బ్లాగుల ప్రపంచం..
నాతో పాటు నా పోస్టింగ్స్ చదివి, వాళ్లకి నచ్చిన విషయాలను మెచ్చుకుని,
నన్ను వాళ్ళ కామెంట్స్ తో ప్రోత్సహించిన బ్లాగ్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు.
ముఖ్యంగా జయ గారు,మాలాకుమార్ గారు దాదాపు నా పోస్టింగ్ లన్నిటినీ మెచ్చుకుని నాకు కామెంట్స్ ఇచ్చి ప్రోత్సహించారు.
ధన్యవాదాలు మాలాకుమార్ గారు,జయ గారు..
నా చిన్నిప్రపంచంలో నాకు నచ్చినట్లుగా నేను సాగిస్తున్న నా ఈ బ్లాగ్ ప్రయాణం ఇలాగే ఆహ్లాదకరంగా,ఎన్నో మధురానుభూతులకు వేదికగా సాగిపోవాలని కోరుకుంటూ..