పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, జూన్ 2011, బుధవారం

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి

మాచెల్లి నిశ్చితార్ధం రోజుకి తనది యు కట్ హెయిర్ స్టైల్.
అప్పటికి అలాగే ఉంచేసి పెళ్లప్పటికి కొంచెం జుట్టు పెంచి దానికి మళ్ళీ సవరం యాడ్ చేసి మల్లెపూల జడ వేశాము..
అలా మా చెల్లికి మల్లెపూల జడ వేయించాలన్న మా అమ్మ కోరిక ,కోడలిని జడతో చూడాలన్నవాళ్ళ
అత్తగారి కోరికా రెండూ తీరాయన్నమాట..
మా రమ్యని పెళ్లికూతురిని చేసిన మొదటి రోజు,రెండో రోజు మల్లెపూలతో నేనే తనకి జడ వేసాను..
తనకి తెచ్చిన రెడీమేడ్ పూలజడకన్నా నేను వేసిన జడే తనకి నచ్చిందట..మా చెల్లికి నేను పెట్టిన పారాణి.


మా చెల్లికి పెళ్ళిలో చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ గోరింటాకు దగ్గరనుండి పారాణి దాకా అన్నీనేనే
నాసొంతగా చేయటం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది..
తను ఎప్పుడైనా ఈ ఫొటోస్, వీడియో చూసుకున్నప్పుడు ఇవన్నీ మా అక్కే నాకు చేసింది అని గుర్తుకువస్తుంది కదా...
ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద పనులు కాకపోయినా ఒక్కోసారి చిన్నిచిన్ని విషయాలే చాలా గొప్పగా అనిపిస్తాయి
అలాగే నేను చేసిన ఈ చిన్ని పనులు నాకు కూడా ఎంతో సంతోషాన్ని,ఆనందాన్ని కలిగించాయి...

My Dear Sweet Sister Ramya And Bhadra
Wishing you a Wonderful Life
And A Future Filled With
Joys And Happy Surprises


Related Posts Plugin for WordPress, Blogger...