17, ఏప్రిల్ 2011, ఆదివారం
మల్లెపూలజడ
నిన్న నిదురించే తోటలోకి బ్లాగ్ లత గారు తన మల్లెపూలజడ తీపి గుర్తులను పోస్ట్ చేసారు.ఈ పోస్టింగ్ చూసిన వెంటనే
నాకు నా పూలజడ గుర్తుకు వచ్చింది.
వెంటనే అమ్మ నాకు చిన్నప్పుడు పూలజడతో తీయించిన ఫోటో వెతికేసి,ఇప్పుడు బ్లాగ్లో పెట్టేస్తున్నాను.
మా నాన్న వాళ్ళ వూరి దగ్గర మంచి మల్లె మొగ్గలు (అక్కడ మంచి పూలు దొరుకుతాయి ) ,కనకాంబరాలు తెప్పించి,ఇంటి దగ్గర పూలజడ వేసేవాళ్ళని ముందుగానే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయితో మాట్లాడించి,మా పెద్దమ్మ కూతురు సంధ్యక్క ని తోడు తీసుకుని వెళ్లి ,సుమారు ఎంతసేపు పట్టిందో గుర్తులేదుకానీ కదలకుండా కూర్చోపెట్టి నాకు పూలజడ వేయించింది అమ్మ.
తర్వాత మా చెల్లికి కూడా పూలజడ వేయించాలని చాలా అనేది అమ్మ.. కానీ తనది U Cut Hairstyle కావటంతో అమ్మ కోరిక తీరలేదు.
తన నిశ్చితార్ధం రోజున కూడా వాళ్ళ అత్తగారు జడ వెయ్యమని ఎంత గొడవ చేసినా సవరం పెట్టినా అది నిలవకుండా పడిపోయింది పాపం...
అందుకే మాచెల్లి పెళ్లి ఎలాగూ సమ్మర్లో కాబట్టి మల్లెపూలజడ వేయించాలని తీవ్ర ప్రయత్నంలో ( జడ పెంచటానికి ) వున్నాము..తన పూలజడని కూడా త్వరలోనే నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను...
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
Summer Specials...