The traveler sees what he sees, the tourist see what he has come to see. |
తెలియకుండా చూసినా వైవిధ్యంగా బాగుంది అనిపించింది ఎల్లోరాకి 4కి.మీ దూరంలో ఖుల్తాబాద్ భద్రమారుతి టెంపుల్.ఇప్పటిదాకా ఎక్కడా లేనట్లుగా పడుకుని ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఈ భద్రమారుతి గుడి ప్రత్యేకత.ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడే కాసేపు పడుకున్నాడని ఒక కధ ఉంటే, పూర్వం భద్రావతీ నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు.మహారాజుకు రాముడిపై అమితభక్తి. ఎప్పుడూ శ్రీరాముడ్ని భజనలు, స్తోత్రాలతో స్తుతించేవాడట.ఒకరోజు భద్రకూట్ అనే సరోవరం దగ్గర భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా విని తన్మయుడైన ఆంజనేయ స్వామి అక్కడే నిద్రపోయాడట.భద్రసేన మహారాజు రామభక్తికి మెచ్చి అతని కోరిక మేరకు ఇక్కడ భద్ర మారుతిగా కొలువయ్యాడని పురాణ కధనం.
భద్రమారుతి ఆలయం
షాజహాన్,ముంతాజ్ బేగంల మూడవకొడుకుఆలంగిర్("ప్రపంచాధినేత")అని పిలిపించుకున్న ఔరంగజేబ్ .గుజరాత్ రాష్ట్రం లో దాహోడ్ నగరంలో 1618 నవంబరు 3న జన్మించి, 1707 మార్చి 3న
మరణించాడు. ఇతని సమాధి ఔరంగాబాద్ లోని ఖుల్దాబాద్ గ్రామంలో వుంది.ఈ సమాధి అప్పటి రాజుల tombs కి విరుద్ధంగా చాలా చిన్న స్థలంలో ఉంది. ఇక్కడంతా చాలా నిశ్శబ్దం.నవల్స్ లో, కధల్లో రాసినట్లు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది, అక్కడంతా ఏదో స్తబ్ధత అన్నట్లుంది.ఇక్కడ రకరకాల అత్తర్లు (scent) ఏవేవో డిజైన్స్ ఉన్న బాటిల్స్ లో అమ్ముతున్నారు.
పైథానీ శారీస్ .. ఔరంగాబాద్ లోని పైథాన్ నగరం పేరుతో ఉన్న ఈ చీరల్ని మగ్గాలతో నేస్తారు. పైటంచులకి నెమళ్ళు ఈ చీరల ప్రత్యేకత.అయినా ఇప్పుడు ఏ చీరలు ఎక్కడైనా దొరుతున్నాయి కూడా ...షాపింగ్ అది కూడా చీరలంటే అంత సరదా లేకపోయినా ఆ చీరల ప్రత్యేకత, అవి తయారయ్యే ప్రదేశం చూడొచ్చని వెళ్ళాము.
బీబీ కా మక్బరా ఆగ్రాలోని తాజ్ మహల్ ని పోలిన దీన్ని ‘ది తాజ్‌మహల్ ఆఫ్ డెక్కన్’ Dakkhani Taj అంటారు.ఔరంగాబాద్ లో ప్రాముఖ్యత చెందిన చారిత్రిక కట్టడాల్లో ఇది ఒకటి.ఔరంగజేబ్ కుమారుడు ప్రిన్స్ ఆజమ్ షా దీన్ని అతని తల్లి ,ఔరంగజేబ్ భార్య అయిన రబియా ఉద్ దురాని జ్ఞాపకార్ధం నిర్మింపచేశాడు.మేము ఇక్కడికి వెళ్ళేసరికే బాగా చీకటి పడటంతో తాజ్ మహల్ సరిగా చూడలేకపోయాము.అక్కడిదాకా వచ్చాము కదా అని చీకట్లోనే లోపలికి వెళ్లి చూసొచ్చాము.కొంచెం వెలుతురూ ఉండగా వస్తే బాగుండేది అనిపించింది.ఇక్కడ సరైన లైటింగ్ కూడా లేదు.
డెక్కన్ తాజ్ మహల్
పంచక్కిWater Mill ఔరంగాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూసే ప్రదేశాల్లో ఇది ఒకటి.దీన్ని 17వ శతాబ్ధంలో నిర్మించారు.భూగర్భంలో ఉన్న మట్టి పైపుల ద్వారా వచ్చే నీటిని ఉపయోగించి పవర్ జెనరేట్ చేయటం ద్వారా చక్కి అంటే విసుర్రాయిని తిప్పి గోధుమలని పిండి చేసి యాత్రికులకు,సాధువులకు భోజనం పెట్టేవారట.17 వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతంగా దీన్ని వర్ణిస్తారు.బాబా షా ముసాఫిర్ అనే సూఫీ ప్రవక్త దర్గా దీనికి పక్కనే ఉంది.