పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ సీతారాముల కళ్యాణము .. నా చిన్నిప్రపంచంలో ...!


రామా
కనవేమిరా! శ్రీ రఘురామ కనవేమిరా...!
రమణీ లలామ నవలావణ్యసీమ,
ధరాపుత్రి, సుమగాత్రి! ధరాపుత్రి, సుమగాత్రి
నడయాడి రాగా...! రామా కనవేమిరా!


సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకినీ,
సభాసదులందరూ పదే పదే చూడగా...
శ్రీరామచంద్రమూర్తి ... కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారటా,
తమలో
సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

రామా కనవేమిరా! శ్రీ రఘురామ కనవేమిరా...
రమణీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...
రామా కనవేమిరా...


ముసిముసి
నగవుల రసిక శిఖామణులూ..
సా ని రి
ఒసపరి చూపుల అసదృశ విక్రములు..
రి ని ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..
థా థకిట థక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు..
థక ఝణు థకధిమి థక
మీసం మీటే రోష పరాయణులూ..
నీ మా రి
మా సరి ఎవరను మక్త గుణోల్బణులు...


క్షణమే ఒక దినమై...నిరీక్షణమే ఒక యుగమై...
తరుణి వంక, శివధనువు వంక, తమ తనువుమరచి,
కనులుతెరచి, చూడగ... రామా కనవేమిరా...


ముందుకేగి, విల్లందబోయి, ముచ్చెమటలు పట్టిన దొరలూ...భూవరులూ!
తొడగొట్టి, ధనువుచేపట్టి, బావురని గుండెలుజారిన విభులు
విల్లెత్త లేక, మొగమెత్తాలేక, సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళు విరిగి, రెండు కళ్ళూ తిరిగి, ఒగ్గేసిన పురుషాగ్రణులూ

ఎత్తేవారు లేరా? విల్లు ఎక్కుపెట్టే వారులేరా?!
థైయకు
థాధిమి థా!


రామాయా...రామభద్రాయ...రామచంద్రాయ నమః!
అంతలో రామయ్య లేచినాడు ... వింటి మీదా చెయ్యి వేసినాడు...
సీత వంక ఓరకంట చూసినాడు ... సీతవంక ఓరకంట చూసినాడు...
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడూ...
ఫెళ ...ఫెళ ... ఫెళ ...ఫెళ ...విరిగెను శివధనువు,
కళలొలికెను
సీతానవవధువూ...


జయ జయరామా ...రఘుకుల సోమా
దశరధరామా
... దైత్యవిరామా
జయ జయరామా ...రఘుకుల సోమా
దశరధరామా
....దైత్యవిరామా


సీతా కళ్యాణవైభోగమే ... శ్రీరామ కళ్యాణవైబోగమే
కనగ కనగ కమనీయమె ... అనగ అనగ రమణీయమె
సీతా కళ్యాణవైభోగమే ... శ్రీరామ కళ్యాణవైబోగమే!రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
రమణీ లలామ నవలావణ్యసీమ,
ధరాపుత్రి, సుమగాత్రి! ధరాపుత్రి, సుమగాత్రి
నడయాడి రాగా...! రామా కనవేమిరా!

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు


రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
16 వ్యాఖ్యలు:

♥తెలుగు పాటలు♥ చెప్పారు...

meeru super andi

Lasya Ramakrishna చెప్పారు...

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

భారతి చెప్పారు...

శ్రీ రామచంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే //
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

వనజవనమాలి చెప్పారు...

Excellent .. Sree Seetaa Ramachandra.. Kalyaanam choosi Tarinchaanu. Thank you very much.

durgeswara చెప్పారు...

మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటూన్నాను జైశ్రీరాం

అజ్ఞాత చెప్పారు...

excellent

మాలా కుమార్ చెప్పారు...

బాగుందండి .

మీకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు

జలతారువెన్నెల చెప్పారు...

Entha baagunnayo pictures and the way you put it all together. Liked this post raaji gaaru.

V.Venkata Pratap చెప్పారు...

సోదరి..రాజీ
నీ బ్లాగులు ఎంతో హృద్యమంగా వున్నాయి తల్లి.
ఎంతో...ఓర్పు,నేర్పు తో కూడిన వీటిని కొనసాగించగలవు.ఇప్పటి వరకు వీటిని నేను మిస్ అయ్యానని అనిపించిందమ్మ.వుంటాను.ప్రతాప్

C.ఉమాదేవి చెప్పారు...

కళ్యాణం కమనీయం.

జయ చెప్పారు...

సీతమ్మ పెళ్ళి చాలా బాగా చేసావు రాజీ. ఆ అమ్మవారి చల్లని దీవెనలు నీకెప్పుడూ ఉండాలి. శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

@ తెలుగు పాటలు గారూ..
అభిమానంతో ఇచ్చిన మీ కాంప్లిమెంట్ కి చాలా థాంక్సండీ!
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు!


@ Lasya Ramakrishna గారూ.. థాంక్సండీ
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు!


@భారతి గారూ.. మీ శుభాకాంక్షలకు,
అలాగే చక్కని శ్రీరాముడి స్తోత్రానికి ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు!


@ వనజవనమాలి గారూ..
నా చిన్నిప్రపంచంలో సీతారాముల కళ్యాణం చూసి మెచ్చుకున్నందుకు ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు!


@ durgeswara గారూ..
మీ ఆశీస్సులకు,శుభాకాంక్షలకు ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు!

రాజి చెప్పారు...

@ kastephale గారూ..
సీతారాముల కళ్యాణం నచ్చినందుకు ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!


@ మాలాకుమార్ గారూ..
సీతారామ కళ్యాణం నచ్చినందుకు ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు!


@ జలతారు వెన్నెల గారూ..
పిక్చర్స్,పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

@ V.Venkata Pratap గారూ..
అభిమానంతో కూడిన మీ అభినందనకు,
అలాగే నా బ్లాగులన్నీ చూసి మీ స్పందన
తెలియచేసినందుకు ధన్యవాదములండీ..

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!


@ C.ఉమాదేవి గారూ..
నా చిన్నిప్రపంచంలో సీతారాముల కళ్యాణం కమనీయమన్న మీ స్పందనకు ధన్యవాదములండీ..

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

రాజి చెప్పారు...

@ జయ గారూ సీతమ్మ పెళ్లి నచ్చినందుకు చాలా థాంక్సండీ ..
ఆ సీతమ్మ తల్లి దీవెనలతో పాటూ మీలాంటి పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు వుండాలని కోరుకుంటాను..

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

కమనీయ గీత , చిత్రిత
రమణీయపు పోష్టు చూడ రాజీ గారూ !
విమలము సీతారాముల
కమరిన "కళ్యాణ దృశ్యకావ్యం " బిచటన్

రాజి చెప్పారు...

వెంకట రాజారావు.లక్కాకుల గారూ ..
నా పోస్ట్ ను దృశ్యకావ్యమన్న మీ కవిత నాకు గొప్ప బహుమతండీ..
మీ కవితకు,మీ శుభాకాంక్షలకు ధన్యవాదములు..

మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

Related Posts Plugin for WordPress, Blogger...