పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, ఫిబ్రవరి 2013, సోమవారం

Happy BirthDay To " నా చిన్నిప్రపంచం "



  
నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

నా హృదయంలో నిలిచిపోయే భావాలు  ..
నన్ను నేను తెలుసుకునే అనుభవాలు..
సంతోషంలో నా పెదవులపై నిలిచే  చిరునవ్వులు..
బాధలో నా కంటి నుండి జారే చిన్ని చినుకులు..
నా చుట్టూ ఉన్న మనుషుల  ప్రేమ,అభిమానం అసూయ,ద్వేషాలు..
జయాపజయాలు , పొగడ్తలు, అభినందనలు, అవమానాలు 

అన్నిటిని తనలో ఇముడ్చుకుని  ప్రతి రోజూ ఒక  కొత్త పాఠాన్ని నేర్పుతూ, 

ఎప్పుడూ నన్ను వదలకుండా నాతో ఉండే "నా చిన్నిప్రపంచం" నాకు చాలా ఇష్టం.

" నా చిన్నిప్రపంచం " నాకు కేవలం బ్లాగ్ మాత్రమే  కాదు .. 
నా ప్రియనేస్తం.. నా అంతరంగానికి అక్షర రూపం.
" నా చిన్నిప్రపంచం " పేరుకే చిన్నది కానీ ఎల్లలు లేనిది ... మంచి స్నేహితులను, వ్యక్తులను , కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. 
లోకాన్ని , మనుషుల ప్రవర్తనలను బ్లాగ్ ల ద్వారా కూడా చూసే అవకాశం  కల్పించింది.ఈ నెట్ ప్రపంచంలో నా పేరుకు  ఒక గుర్తింపును తెచ్చింది.

ఇన్నేళ్ళ నా బ్లాగ్ ప్రయాణంలో నేను ఏదో సాధించానని చెప్పను, కానీ నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి..నెట్ ప్రపంచం అయినా బయటి ప్రపంచం అయినా ఎదుటి వాళ్ళ  మనోభావాలు, ఆలోచనలు మనకి నచ్చినా  నచ్చక పోయినా వారి అభిప్రాయాలను గౌరవిస్తే చాలు, ఇతరులను జడ్జ్ చేసే ముందు మన అర్హత ఏమిటో కూడా తెలుసుకుంటే మంచిది అన్న విషయాన్నీ ఎప్పుడూ గుర్తుంచుకుంటాను...

" నా  చిన్నిప్రపంచాన్ని"  ఈ  ప్రపంచానికి పరిచయం చేసి  ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయ్యింది.నాకు చాలా ఇష్టమైన "నా చిన్నిప్రపంచం"  పుట్టినరోజు ఈ రోజు...


 నా చిన్నిప్రపంచానికి ఎప్పుడూ వస్తూ నా ఆలోచనలను, భావాలను మెచ్చుకుని అభినందించే మిత్రులకు,అప్పుడప్పుడు వచ్చి, నా చిన్నిప్రపంచంలో కనిపించే బ్లాగర్లకు అందరికీ "నా చిన్నిప్రపంచం" పుట్టినరోజు సందర్భంగా కృతఙ్ఞతలు ...

  

10 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

మీ చిన్నిప్రపంచాని కి జన్మదిన శుభాకాంక్షలు .

వనజవనమాలి చెప్పారు...

రాజీ గారు .. మీ .."నా చిన్ని ప్రపంచం" కి మూడేళ్ళు నిండిన సందర్వ్హంలో మీకు మనఃపూర్వక అభినందనలు. మీలోనే ఉంది..మిమ్మల్ని అనునిత్యం నడిపించే మీ "నా చిన్ని ప్రపంచం" ప్రవర్ధమానం కావాలని అభిలషిస్తూ.. హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

చిన్ని ప్రపంచం అప్పుడే మూడో అడిగిడిన శుభసమయాన శుభాభినందనలు.ఎప్పుడూ కళకళాడుతూ కొత్త కొత్త అందాలతో విలసిల్లాలి అని కోరుకుంటాను.

రాజి చెప్పారు...

"మాలా కుమార్" గారూ..
మొదటి నుండి మీరు నా చిన్నిప్రపంచానికి మంచి స్నేహితులు ఇప్పుడు కూడా మీ శుభాకాంక్షలు అందుకోవటం చాలా సంతోషమండీ..
ధన్యవాదములు..

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారూ.
మీ శుభాకాంక్షలు,ఆశీస్సులు నా చిన్నిప్రపంచానికి ఎప్పుడూ అవసరమండీ..
మీ స్నేహం నాకు,నా చిన్ని ప్రపంచానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను..
మీ శుభాకాంక్షలకు,దీవెనలకు ధన్యవాదములు..

రాజి చెప్పారు...

"జయ" గారూ..
మీ శుభాకాంక్షలు,దీవెనలు, ఎవరు కామెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ప్రొత్సహిస్తూ సరదాగా ఇచ్చే ప్రొత్సాహం .. నా చిన్ని ప్రపంచానికి చాలా ఇష్టమండీ..
మీరు ఎప్పుడూ నా చిన్నిప్రపంచంలో ఉండాలని కోరుకుంటాను..
మీ శుభాకాంక్షలకు,దీవెనలకు ధన్యవాదములు..

రసజ్ఞ చెప్పారు...

మీ (మన) చిన్ని ప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు! మరెన్నో మంచి మంచి టపాలతో, ఎంతో మంది అభిమానులని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను.

రాజి చెప్పారు...

" రసజ్ఞ " గారూ.
మీ మన చిన్నిప్రపంచానికి మీలాంటి అభిమానులు ఉన్నందుకు నాకు చాలా సంతోషమండీ..
మీ అందరి అభిమానం,స్నేహం ఎప్పటికీ ఉండాలని కోరుంకుంటున్నాను.
మీ శుభాకాంక్షలకు ధన్యవాదములు..

జ్యోతిర్మయి చెప్పారు...

ఆలస్యంగా చూసాను. మీ చిన్ని ప్రపంచానికి జన్మదిన సుభాకాంక్షలండి.

రాజి చెప్పారు...

"జ్యోతిర్మయి" గారూ..
ఆలస్యంగానైనా అభిమానంతో మీరందించిన శుభాకాంక్షలకు ధన్యవాదములండీ..

Related Posts Plugin for WordPress, Blogger...