
భావ వ్యక్తీకరణ గొప్ప గొప్ప మాటల్లోనే చేయాల్సిన అవసరం లేదు.
మనసును తెలిపే ఒక చిన్ని చిరునవ్వు.. ఒక చిన్నమాట , ఒక మంచి పాట
చివరికి మౌనం కూడా భావ వ్యక్తీకరణలో భాగమే..
నాకు పెద్ద పెద్ద కవిత్వాలు రాయటం రాదు,కధలు చెప్పటం రాదు,కానీ నామనసుకు
నచ్చిన విషయాలని నా చిన్నిప్రపంచంలో ఎప్పటికీ గుర్తుండేలా దాచుకోవటం నాకు ఇష్టం.
అందుకే నా ఈ ప్రయత్నం...
నాకు పాటలు వినటం ఇష్టం అందుకే పాటల బ్లాగు రాస్తాను,నాకు ఇష్టమైన పాటలు సేకరిస్తాను.
నా సరిగమలు ... గలగలలు బ్లాగు నాకు సెలెక్టేడ్ సాంగ్స్ వినే నా సంగీత ప్రపంచం
పాటలకి యూ ట్యూబ్ ఉంది కదా నీ బ్లాగ్ అవసరమా అని కొందరు అనొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది కదా!
ఇంక పిక్చర్స్ ... నా బ్లాగ్ లో ప్రతి పోస్ట్ కి పిక్చర్స్ యాడ్ చేస్తాను.
ఇన్స్పిరేషన్ కొటేషన్స్ , పిక్చర్స్ సేకరించటం నాకు ఇష్టం..
ఎందుకంటే ఎన్నో మాటల్లో చెప్పలేని భావాలు పిక్చర్స్ చెప్తాయి..
"A picture is worth a thousand words" కదా!
'Everyone is Special'

16 కామెంట్‌లు:
అవును నిజం . ఎవరి ఇష్టం వారిది.. పోస్ట్ బాగుంది రాజీ గారు.
పోస్ట్ నచ్చినందుకు థాంక్యూ వనజవనమాలి గారూ..
మీకు తెలియదు కాని మీ పాతమధురాలకి పెద్ద ఫాలోయింగ్ ఉందండోయి రాజి గారు.
నాకు తెలిసిన వారందరూ, ఒక పక్క అఫీస్ వర్క్ చెసుకుంటూనే, మీ బ్లాగ్ లో పాటలు వినడం నేను చాలా సార్లు చూసాను.మీ కోట్స్ అన్ని బాగున్నయి. నైస్ పోస్ట్ అండి.
Raaji gaaru,
Be your Self!
cheers
zilebi.
"జలతారువెన్నెల" గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతం..
నా ఆపాత మధురాలు బ్లాగ్ గురించి ఒక మంచి విషయం చెప్పినందుకు థాంక్సండీ :)
పోస్ట్ నచ్చినందుకు థాంక్యూ..
Zilebi గారూ..
Thank You!
Nice Post రాజీ గారూ..దూసుకుపోండి అంతే:):):)
రాజిగారూ మీ టపా చదవగానే నాకీ పాట గుర్తొచ్చినదండీ..
http://www.youtube.com/watch?v=G17eL8z9Mo4
"సుభ" గారూ.. పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ..
ఇంక ప్రోత్సాహానికి ధన్యవాదములు కానీ దూసుకుపోవటం వద్దులేండి.. :):)
ఈ విషయంలో నిదానమే ప్రధానం అనుకుందామని అనుకుంటున్నాను :)
"జ్యోతిర్మయి" గారూ.. నా పోస్ట్ కి తగిన పాట చూపించినందుకు చాలా థాంక్సండీ..
నిజంగా పాట చాలా బాగుంది.
మీ గిఫ్ట్ గా ఈ వీడియోని ఈ పోస్ట్ లో అప్ డేట్ చేస్తున్నాను..
ThankYou!
video chaalaa baagundi ..Raajee .. Thank you very much..Both..
బాగుంది రాజి. మంచి అభిప్రాయాలు....మంచి సేకరణలు. Be yourself. Congrats.
"వనజవనమాలి" గారూ.. అవునండీ వీడియో చాలా బాగుంది అందుకే వెంటనే నా పోస్ట్ లో అప్ డేట్ చేశాను నచ్చినందుకు థాంక్సండీ..
"జయ" గారూ... నా అభిప్రాయాలు సేకరణలు నచ్చినందుకు చాలా థాంక్సండీ..
మీరు నా ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ కదండీ అందుకే
నా చిన్నిప్రపంచం మీకు ఎప్పుడూ నచ్చుతుంది :)
ThankYou very Much For Your Best Wishes!
రాజిగారూ ఆ పాట నచ్చి వెంటనే అప్ లోడ్ చేసేశారా. బావుందండీ..అమెరికా వచ్చిన కొత్తల్లో మా పాపతో కలసి 'బార్నీ' చూసేదాన్ని. నాకు ఎంత నచ్చేవో అవన్నీ..
"జ్యోతిర్మయి" గారూ.. అవునండీ పాట కరెక్ట్ గా
పోస్ట్ కి తగినట్లుగావుంది..
నిజంగా చాలా బాగుంది అందుకే వెంటనే పోస్ట్ లో పెట్టేశాను.
పాట చూడగానే అనుకున్నాను అవి మీరు మీ పాప,బుజ్జిపండుతో కలిసి చూసే పాటలు అయ్యుంటాయని!
ఒక మంచి పాటను చూపించినందుకు థాంక్సండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి