సెప్టెంబర్ 1 న వినాయకచవితి అయిపోగానే అనుకోకుండా మా ఫామిలీతో వెళ్ళిన ట్రిప్ తమిళనాడు.
వినాయకచవితి అయిపోయిన రెండోరోజే అంటే సెప్టెంబర్ 3 న బయలుదేరి
"కాణిపాకం",
"తిరువన్నామలై(అరుణాచలం)""సాతనూర్ డామ్" "శ్రీపురం గోల్డెన్ టెంపుల్" "శివ కంచి" "విష్ణుకంచి"
అన్నీ చూసి వచ్చాము... మా కుటుంబం అంతా కలిసి వెళ్ళిన
ఈ ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని ఒక మధురానుభూతిగా
ఎంతో సంతోషకరమైనయాత్రగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు.
నా ఈ sweetmemories నా చిన్నిప్రపంచంలో ఎప్పటికీ భద్రపరచుకోవాలని అనుకుంటున్నాను.
సెప్టెంబర్ 3 సాయంత్రం మా కుటుంబం అందరితో కలిసి మా వెహికల్ లో బయలుదేరాము
వినాయకచవితి అయిపోగానే వెళ్ళిన ట్రిప్ కావటంతో దారిపొడుగునా 3 వ రోజు నిమజ్జనానికి వెళ్ళే వినాయకులు,
అలాగే రకరకాల అందమైన మండపాలలో, విద్యుత్ దీపాలతో కనువిందు చేసే అలంకరణల్లో పూజలందుకుంటున్న
గణనాధులను దర్శించుకుంటూ,కొన్నిచోట్ల నిమజ్జనానికి వెళ్ళే వినాయక మండపాలు వాళ్ళు పెట్టే ప్రసాదాలు తింటూ మా ప్రయాణం ఆనందంగా సాగిపోయింది.
అంతమంది వినాయకులను ఒకేసారి దర్శించుకోవటం చాలా సంతోషంగా అనిపించింది.
4 వ తారీకు తెల్లవారుజాముకు కాణిపాకం చేరుకున్నాము.
మేము చూసిన ఆ వినాయక చవితి సందళ్ళు...
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి