పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, అక్టోబర్ 2011, గురువారం

కాణిపాకం To విష్ణుకంచి - 2 ( కాణిపాకం )

సెప్టెంబర్ 4 తెల్లవారుజాము నాలుగు గంటలకు బ్రహ్మోత్సవాలలో కళకళలాడిపోతున్న విద్యుత్ దీపాల కాంతులతో
ప్రత్యేక అలంకరణలో వీధులన్నీ అలంకరించిన ఫ్లెక్సీలతో ఎంతో ఆహ్లాదకరంగా వున్న కాణిపాకం వెళ్ళాము.
అక్కడ జనం అంతగా లేకపోవటంతో దర్శనం ,పూజలు వెంటనే అయ్యాయి...
ప్రత్యేక అలంకరణలో వున్న వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని,మమ్మల్ని కరుణించమని వేడుకుని,
తీర్ధప్రసాదాలు తీసుకున్నాము.
బ్రహ్మోత్సవాల టైములో అనుకోకుండా లభించిన ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శనం
మాకు చాలా ఆనందంగా అనిపించింది.గుడిలో రకరకాలుగా అలంకరించిన వినాయకులు వున్నారు.
కూరగాయలు,డ్రై ఫ్రూట్స్ తో చేసిన వినాయక విగ్రహాలు చాలా బాగున్నాయి.
లోపల ఫొటోస్ తీయనివ్వరు కదా అందుకే వాటిని మిస్ అయ్యాము..
తీర్ధప్రసాదాలు తీసుకుని,పక్కనే వున్నశివాలయానికి వెళ్లి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము..

బయటికి రాగానే ఆవరణలో రకరకాల వాయిద్యాలను వాయిస్తున్న బొజ్జగణపయ్యల విగ్రహాలు చాలా చూడముచ్చటగా,అందంగా వున్నాయి.
అవన్నీ ఫోటోలు తీసుకుని,అక్కడే Breakfast చేసి,షాపింగ్ చేసుకుని మా నెక్స్ట్ ప్లేస్
తిరువన్నామలై
( అరుణాచలం ) బయలుదేరాము.
కాణిపాకంలో బ్రహ్మోత్సవాల ప్రత్యేక అలంకరణ




Related Posts Plugin for WordPress, Blogger...