
వర్షాకాలం మొదలవ్వగానే మొక్కలు తెచ్చి నాటటం మా ఇంట్లో అందరికీ ఇష్టం.
చెల్లిని శ్రావణమాసం కోసం ఇంటికి తీసుకు రావటానికి హైదరాబాద్ వెళ్ళిన మాకు మా చెల్లి వాళ్ళింటికి వెళ్ళే దారిలో
నర్సరీలు కనిపించాయి..మొక్కలు చూసిన తర్వాత ఇంక కొనకుండా ఉండగలమా వెంటనే ఆ నర్సరీకి వెళ్లి మంచి గులాబీ మొక్కలు తెచ్చుకున్నాము..
అప్పుడే వర్షం కురిసి ఆగిన ఆ చల్లటి వాతావరణంలో ఎటు చూసినా ఆకుపచ్చగా రంగురంగుల రకరకాల
పూల మొక్కలతో మనసును ఆహ్లాదపరచేలా వున్న ఆ నర్సరీని వదిలి రావాలనిపించలేదు.
మా మరిది గారు కూడా మొక్కల సెలెక్షన్ లో మాకు హెల్ప్ చేశారు..
ముద్దమందారాలు, ఎన్నెన్నో రంగుల్లో గులాబీలు ఇంకా ఏవో రకరకాల చెట్లు ఆ అందాలను కళ్ళారా చూడాలే కానీ
వర్ణించటం సాధ్యం కాదు నర్సరీలో నేను తీసిన కొన్ని ఫోటోలు..





వర్షంలో తడిసి ముద్దయిన ముద్దుమందారాలు..ఎంతబాగున్నాయో కదా..



అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం..
పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగి నేల చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే..
నేచర్ WallPapers తో మా చెల్లి రమ్య వీడియో మిక్సింగ్ చేసిన పాట..
పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగి నేల చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే..
నేచర్ WallPapers తో మా చెల్లి రమ్య వీడియో మిక్సింగ్ చేసిన పాట..

6 కామెంట్లు:
మొక్కలు,వాటికి పూలు చాలా బాగున్నాయ్ రాజి :) మీ చెల్లి వీడియో కూడా! మొక్కలు ఎంత ఆనందాన్నిస్తాయో కాని అవి ఆశించేది గుక్కెడు నీళ్ళు మాత్రమె! అందుకే స్వార్ధరహితమైన మొక్కలు,చెట్లు అంటే నాకు చాల ఇష్టం :)
థాంక్యూ ఇందు...మా చెల్లి తరపున కూడా..
మీరు చెప్పింది నిజమే నిస్వార్ధంగా మనకు ఆనందాన్ని అందించే
మొక్కలు,చెట్ల గురించి చాలా చక్కగా చెప్పారు..
రాజీ చాలా అందమైన ప్రపంచం చూపించారు. ఇంత ముగ్ధమనోహర పూలను మెచ్చని వారెవరైనా ఉంటారా. మీ ఇద్దరికీ అభినందనలు.
మాచెల్లి,నేను చేసిన చిన్ని ప్రయోగానికి
"అందమైన ప్రపంచం" అన్న మంచి బిరుదు ఇచ్చినందుకు...
మా చెల్లి తరపున,నా తరపున ధన్యవాదములు జయ గారు...
మీ గులాబీలు అన్నీ చాలా బాగున్నాయి.నర్సరీలో మేము ఎన్నిసార్లు కొన్నా ఇంటికి రాగానే పూలు పూయవు.నాకు పూవులు పెంచటం రాదని ఊరుకున్నాను.
"నీహారిక" గారు మీ వ్యాఖ్య నన్ను వెనక్కి ఎన్నెన్నో జ్ఞాపకాల దగ్గరికి తీసుకెళ్ళిందండి.2 సంవత్సరాలక్రితం వరకు వర్షాకాలం వస్తుందంటే చాలు పూల మొక్కల కోసం ఎదురుచూసేది అమ్మ. ఇంటిదగ్గరికి వచ్చే కడియం నర్సరీ వాళ్ళ దగ్గర్నుండి నర్సరీల దాకా అన్నీ గులాబీ మొక్కలే కొని నాటేవాళ్ళం. నిజంగా బాగా పూసేవి కూడా. కానీ రెండేళ్లుగా ప్లేస్ మారాము,మొక్కలు పెంచటం కూడా కుదరటం లేదు... కానీ మళ్ళీ తప్పకుండా అలా గులాబీలు పూయించాలని మా అందరి కోరిక.. మీ తోటలో కూడా గులాబీలు పూయించండి, కడియం నర్సరీ మీ వైపే కదా .. :)
Thank you ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి