పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

16, జులై 2011, శనివారం

ప్రేమంటే తెలుసా నీకు.....ప్రేమ ఈ మాట వినని వాళ్ళు, తెలియని వాళ్ళు,ఎప్పుడు ఉపయోగించనివాళ్ళు
వుండరేమో నాకు తెలిసి..
ప్రేమ గురించి ప్రతి మనిషికీ ఎన్నో అభిప్రాయాలూ ఎన్నో నమ్మకాలు

మనిషి తన అవసరాలకు తగినట్లు తన నమ్మకాలతో,సిద్దాంతాలతో కొన్ని వర్గాలను తయారు చేసుకుంటాడు.
తనను ప్రేమించే వారందరూ ఒక వర్గం,తనను ద్వేషించే వారందరూ ఒక వర్గం
తనతో ఏకీభవిస్తే ప్రేమ లేకపోతే ద్వేషం...
ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా.... మనం ఎంతగా ఎవరిని ప్రేమించినా,ఎవరితోనైనా మనం ప్రేమించబడినా ఒక్క సందేహం మాత్రం ఎప్పటికీ సందేహంగానే మిగిలిపోతుంది...అది
ఏ కారణము,ఏ అవసరము,ఏ అనుమానము,ఏ సంబంధము లేకుండా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించగలడా???
ప్రేమరాహిత్యమంటే నిన్నెవరు ప్రేమించకపోవటమా?
నువ్వెవరినీ ప్రేమించకపోవటమా??

ప్రేమ ప్రేమని ప్రేమిస్తుంది అంటారు కానీ నిజమైన ప్రేమ అవతలి వైపు నుండి ప్రేమలేకపోయినా ప్రేమించటం ఆపదు.
నిజమైన ప్రేమంటే అవతలి వాళ్ళ బలహీనతలని కూడా ప్రేమించగలగాలి...
ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయగలగటమే ప్రేమంటే...
ప్రేమించగలిగేవాళ్ళు,ప్రేమించబడే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే వుంటారు
ఆహ్లాదాన్ని,ఆనందాన్ని అందరికీ పంచుతారు...
ప్రేమించటానికి హృదయం వుండాలి
ప్రేమించబడటానికి వ్యక్తిత్వం వుండాలి

చెట్టుని,పుట్టని ప్రేమించగలగాలి,వర్షాన్ని,మంచుని ప్రేమించగలగాలి
మేఘమొస్తుంటే సంతోషించాలి,పూవు పూస్తుంటే మైమరచిపోవాలి
విశ్వాన్ని,ప్రకృతిని,సాటిమనిషిని ప్రేమించేవాళ్ళ మనసునుంచి ఆనందాన్ని,
పెదవి మీద నుండి సంతోషాన్ని,చిరునవ్వుని బ్రహ్మ కూడా చెరపలేడు..


ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావో
అబ్బాయి చాలా మంచోడు.

8 వ్యాఖ్యలు:

మానస.. చెప్పారు...

Nice...

రాజి చెప్పారు...

Thankyou మానస.. garu...

The Chanakya చెప్పారు...

బాగుంది. ముఖ్యంగా చివరి పేరా చాలా బాగుంది. ప్రకృతిని ప్రేమించగలిగిన వాడికి ఏకాంతమే ఉంటుంది కానీ ఒంటరితనం ఉండదు. కానీ..

>>తనతో ఏకీభవిస్తే ప్రేమ లేకపోతే ద్వేషం<<

ఇది మాత్రం నేను ఒప్పుకోను. ఇద్దరి మనుషుల మధ్య సంబంధాలను నిర్ణయించేవి కేవలం అభిప్రాయాలు మాత్రమే కాదు. ఇంకా చాలా అంశాలు దానికి కారణమౌతాయి. Anyway, nice post.

రాజి చెప్పారు...

చాణక్య గారు నా టపాపై స్పందించినందుకు మీ అభిప్రాయాలను తెలియచేసినందుకు ధన్యవాదములు...

"తనతో ఏకీభవిస్తే ప్రేమ లేకపోతే ద్వేషం"
ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మనిషికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే అని నా అభిప్రాయం...

"ఇద్దరి మనుషుల మధ్య సంబంధాలను నిర్ణయించేది కేవలం అభిప్రాయాలు కాదు" ఇది కొంత వరకు నిజమే కానీ ఎన్ని బంధాలు కేవలం అభిప్రాయబేధాల కారణంగా తెగిపోవటం లేదంటారు???

The Chanakya చెప్పారు...

క్షమించాలి. కేవలం అభిప్రాయ బేధాల వల్ల విడిపోవటం లేదు. ఆ లెక్కన కలిసున్న జంటలన్నీ అన్ని విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉండాలి. కానీ అది ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేదేనా..? అభిప్రాయాల్ని ఎదుటివారికి కమ్యూనికేట్ చెయ్యడంలో లోపమే చాలా సంబంధాలను దెబ్బ తీస్తుంది.

రాజి చెప్పారు...

కలిసున్న జంటలన్నీ అన్ని విషయాల్లో ఏకాభిప్రాయంతో వుంటారని నేను అనను ఎందుకంటే
బంధాలు సంబంధాలు అంటేనే కొన్ని సర్దుబాట్లు,కొన్ని కట్టుబాట్లు

కొన్నిసార్లు అవి తప్పదు కాబట్టి పాటించే వాళ్ళు వుంటారు..
కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ మీద ఇష్టంతో,ప్రేమతో పాటించే వాళ్ళు కూడా వుంటారు...

కలిసివున్న ప్రతి ఒక్కరి మధ్య ప్రేమ వుంటుంది అని నేను నమ్మను...
అది ఏ బంధమైనా సరే ...

The Chanakya చెప్పారు...

>> కలిసివున్న ప్రతి ఒక్కరి మధ్య ప్రేమ వుంటుంది అని నేను నమ్మను...<<

I agree with you on this.

రాజి చెప్పారు...

Thankyou Chanakya garu...

Related Posts Plugin for WordPress, Blogger...