పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, మే 2011, ఆదివారం

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు...


ఇల్లంటే నలుగురు మనుషులు ప్రేమ,ఆప్యాయతలతో బంధించబడవలసిన నిలయమే కానీ,
పదిమంది శత్రువులు తమ తమ గదుల్లో వ్యూహాలు పన్నుతూ తప్పనిసరిగా
కలిసి బ్రతకాల్సి వచ్చే ఒక వలయం కాదు..
మనషి బంధించబడాల్సింది ప్రేమానురాగాలతోనే కానీ conditions,Rules తో కాదు.
కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు వుండటం సహజమే కానీ
ఆ ప్రేమ ఎప్పుడూ ఒకరి మీద ఒకరికి ఉన్నప్పుడే అది గొప్ప కుటుంబం అవుతుంది...

కుటుంబంలోని ప్రేమానురాగాలు,క్రమశిక్షణ ఒక మనిషిని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తయారు చేస్తాయి.
అదే కుటుంబంలోని బాధ్యతారాహిత్యం,అవసరానికి మించిన నియంతృత్వం ఇంకొక మనిషిని మానసికంగా కుంగదీస్తుంది... లేదా సంఘ వ్యతిరేకులుగా తయారు చేస్తుంది..

మంచి వివాహమే మంచి దాంపత్యం
మంచి దాంపత్యమే మంచి సంతానం
మంచి
సంతానమే మంచి సమాజం
మంచి
సమాజమే మంచి ప్రపంచం


అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు...

4 వ్యాఖ్యలు:

శిశిర చెప్పారు...

చిన్నగా చెప్పినా చాలా బాగా చెప్పారు.

రాజి చెప్పారు...

థాంక్యూ శిశిర గారు..

జయ చెప్పారు...

అమ్మో! ఈ రోజు శుభాకాంక్షలు చెప్పుకోకుండా ఉండటమే....మీకు కూడా నా హృదయపూర్వక కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

హాయ్ జయ గారు ఎలా వున్నారు??
thanks for your wishes..

మీ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా ?
మీకు కూడా నా హృదయపూర్వక
కుటుంబదినోత్సవ శుభాకాంక్షలు...

Related Posts Plugin for WordPress, Blogger...