మా ఇంట్లో నాకు , మా తమ్ముడికి ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం.
ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కార్ లో,మా ఇద్దరి మొబైల్ లో ఇళయరాజా పాటలు తప్పకుండా ఉండాల్సిందే..
అలా మాకు ఇష్టమైన,నేను కలెక్ట్ చేసిన ఇళయరాజా గారి పాటలు
ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడే అభిమానుల కోసం
నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో ...
మా చెల్లి రమ్య చిన్నప్పటి నుండి చాలా టాలెంటెడ్ . మంచి బొమ్మలు గీస్తుంది,పైటింగ్స్ వేస్తుంది..స్కూల్ డేస్ లో కూడా ఎక్కడ పైంటింగ్,డ్రాయింగ్ పోటీలు జరిగినా తనే విన్ అయ్యేది. ఇంట్లో వాళ్ళందరం తన టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్లము.. నేను,తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా తన పైటింగ్స్ కి కావలసినవన్నీ తెచ్చివ్వాల్సిందే.. పెళ్ళైన తర్వాత కూడా తన హాబీస్ ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని మేమందరం అనుకునే వాళ్లము. దానికి తగినట్లే తన హజ్బండ్ మా చెల్లి ఆర్ట్ ని ,టాలెంట్స్ ని మాకంటే ఎక్కువగా ఇష్టపడతారు.. మేము ఎలాగైతే తనకి అవసరమైనవన్నీ తెచ్చి ప్రోత్సహిస్తామో మా మరిదిగారు భద్ర కూడా అలాగే చేస్తారు.. తన అభిరుచుల్ని గుర్తించి,గౌరవించి,ప్రోత్సహించే భర్త దొరకటాన్ని మించిన అదృష్టం ఏ అమ్మాయికైనా ఏముంటుంది..
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనకు ఒక పూర్తి స్థాయి కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా తొలి ప్రతి మీద 1949 నవంబర్ 26 న రాజ్యాంగకమిటీ సభ్యులు సంతకాలు చేశారు. 'భారత రాజ్యాంగం' 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. నవంబర్ 26 ను 'జాతీయ న్యాయ దినోత్సవం' గా జరుపుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం రెండు దశాబ్ధాల క్రితం నిర్ణయించింది.
రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయటమే కాక,రాజ్యాంగానికి రక్షణగా న్యాయవ్యవస్థ పని చేస్తుంది కనుక,రాజ్యాంగ తొలి ప్రతులపై రాజ్యాంగ కమిటీ సభ్యులు సంతకం చేసి, రాజ్యాంగ ముసాయిదాను అధికారకంగా ఆమోదించిన నవంబర్ 26 ని న్యాయదినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా మారింది. చట్టం ముందు అందరు సమానమని , ప్రజలందరికి సత్వర న్యాయం అందచేయటమే న్యాయదినోత్సవ ధ్యేయం..
"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించారు.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన సుందరకాండ రామాయణం లోని ఒక భాగం, ఎమ్మెస్.రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి,ఆకాశవాణిలో పాడారు.. ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.(wiki)
నీరాజనం సినిమాలో ఈయన పాడిన "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా" "పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళ కాంతుల్లో" అంటూ తాజ్ మహల్ అందాన్ని వర్ణించిన ఈ పాట ఎందుకో నాకు చాలా నచ్చుతుంది. సినిమాలో ఇది విషాదగీతం అయినా అందమైన ప్రేమకు ప్రతిరూపంగాచరిత్రలో నిలిచిపోయిన తాజ్ మహల్ లా ఈ పాట కూడా గుర్తుండిపోయింది..
మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు,కష్ట నష్టాలు ఎంతో భారంగా మారి బాధపెడతాయి.. కానీ చీకటి వెంటే వెలుగు ఉన్నట్లే.. మనకు జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, దేవుడా నేను ఈ బాధ భరించలేను అనిపించే ప్రతి కష్టం ఒక మంచి ఫలితానికే దారి తీస్తుందని అర్ధంతో వున్నఈ ఫార్వార్డ్ మెయిల్ నాకు నచ్చింది..
ఎందరో మహనీయులు,జీవితంలో విజయం సాధించి ఎదుటి వారికి ఆదర్శంగా నిలిచిన, మంచి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట ఒక గొప్ప సూక్తిగా,మార్గదర్శకంగా నిలిచిపోతుంది.. అలాంటి స్ఫూర్తి దాయకంగా వుండే కొటేషన్స్ సేకరించటం నాకు హాబీ.. ఇప్పటి దాకా నా బ్లాగ్ లో అలాంటి కొటేషన్స్ కొన్ని పోస్ట్ చేశానుకూడా.
నా బ్లాగ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళలో మా చెల్లి రమ్య,మరిదిగారు భద్ర కూడా ఒకరు. చెల్లి తనకేదో పుస్తకం కావాలని షాప్ కి వెళితే అక్కడ వివేకానంద కొటేషన్స్ చూసి, నేను బ్లాగ్ లో పెట్టే కొటేషన్స్ గుర్తుకు వచ్చి అక్కకి ఇవి ఇస్తే బాగుంటుంది కదా అనుకుని ఇద్దరు నాకు ఈ వివేకానంద కొటేషన్స్ 'VoiceOfFreedom' గిఫ్ట్ గా ఇచ్చారు. నా అభిరుచిని తెలుసుకుని మా చెల్లి,మరిది గారు ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకు ఎంతో అమూల్యమైనది..
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family