పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, మే 2012, సోమవారం

స్త్రీ భ్రూణ హత్యలు .. Female Foeticide -- మరో కోణం...!నిన్న అమీర్ ఖాన్ సత్యమేవ జయతే ప్రోగ్రాం లో చర్చించిన విషయం స్త్రీ భ్రూణ హత్యలు..పుట్టబోయే శిశువు ఆరోగ్య స్థితి గతులను తెలుసుకోవటానికి ఉపయోగించే స్కానింగ్ ద్వారా పుట్టబోయే శిశువు ఆడా,మగా అన్న విషయం ముందుగానే తెలుసుకుని,చాలా మంది భర్తలు,భర్త తరపు బంధువులు తమను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశారని,ఒప్పుకోకపోతే వేధించి,తమ పిల్లల్ని చంపటానికి కూడా ప్రయత్నించారని కొందరు మహిళలు ఈ కార్యక్రమంలో తమ అనుభవాన్ని పంచుకున్నారు.. కేవలం పేద,గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండాఉన్నత విద్యా వంతులైన నగర వాసుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగానే వుంది..

భ్రూణ హత్యలతో ‘ఆడ’ సంతతిని తగ్గిస్తే మానవజాతి ఉంటుందా! మనుగడ ఎలా కొనసాగుతుంది? పురుషులు జన్మించేది ‘స్ర్తి’ గర్భంనుంచే కదా! ఆడశిశువు పుట్టుకకు నిర్ణాయక పాత్ర వహించేది పురుషుడి ‘ఎక్స్, వై’ క్రోమోజోమ్‌లే అన్న విషయాన్ని మరచిపోతున్నారు. స్ర్తీ భ్రూణహత్యలవల్ల స్ర్తీ, పురుషుల సంఖ్య నిష్పత్తి ప్రకారం ఉండడంలేదు. స్త్రీలు లేకుండా మగజాతి ఉంటుందా! అసలు మానవజాతి మనుగడ ఉంటుందా!?ఇవీ నిన్నటి కార్యక్రమం లో వ్యక్తమైన భావనలు..

ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్లే ప్రతి సమస్యకి మరో కోణం వుంటుంది...స్త్రీ భ్రూణ హత్య జరిగిందని తల్లి బాధ పడుతున్నప్పుడు ఆ తండ్రికి ఎందుకు బాధ వుండదు??అంటే ఈ భూమి మీద తల్లి మాత్రమే దేవత,తండ్రి రాక్షసుడా??అలాంటప్పుడు ఒక శిశువుకు జన్మనిచ్చే విషయంలో,బిడ్డల్ని పెంచి పోషించే విషయంలో తల్లికి ఎంత బాధ్యత,బాధ వుంటుందో అవన్నీ తండ్రికి ఉండవా ?? భ్రూణ హత్యలన్నీ అత్తింటివాళ్ళు,భర్త బలవంతం మూలంగానే జరుగుతున్నాయా అని కూడా ఆలోచించాలి.

ఈ సమస్యకే సంబంధించిన  ఒక  కేస్ వివరాల్లోకి వెళ్తే అతనికి 2010 లో పెళ్లి జరిగింది . వాళ్లకి ఒక పాప.ఆ పాప పుట్టినప్పుడు అతను కానీ అతని బంధువులు కానీ ఆడపిల్ల పుట్టిందని ఫీల్ అవ్వలేదు, పాపను ఎంతో ముద్దుగా పెంచుకున్నారు.అయితే పాప కి ఒక సంవత్సరం నిండగానే భార్య మళ్ళీ 1 మంత్ 5 డేస్ ప్రెగ్నెంట్ అని తెలిసింది.వెంటనే తెల్లారి నాకు బ్లీడింగ్ అవుతుంది. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లండి అని అత్తని భర్తని అడిగింది.వాళ్ళు వెంటనే దగ్గర్లోనే మంచి  పేరున్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్ బ్లీడింగ్ అయితే పుట్టబోయే బిడ్డ అవయవ లోపాలతో పుడతారు కాబట్టి  అబార్షన్ చేయమంటారా అని అడిగింది. వెంటనే ఆ అమ్మాయి హాస్పిటల్ లో అందరూ   వినేలా  మా అత్తా,మొగుడి  మాట విని నాకు అబార్షన్ చెయ్యాలని చూస్తున్నావా? బ్లీడింగ్ ఆగటానికి ఇంజక్షన్ ఇవ్వు, మా అమ్మ నర్స్ మా అమ్మ మాఊర్లో అలాగే చేసుద్ది.అసలు అనవసరంగా ఇక్కడికి వచ్చాను, మా అమ్మైతె నాకు బాగా చూపించేది అంటూ గొడవ చేసింది.ఈ అమ్మాయి గొడవకి ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయి ఎందుకలా గొడవ చేస్తావు?బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అలా చెప్పాను. నీకు కావాలంటే ఇప్పుడే ఇంజక్షన్ చేస్తాను అంటూ బ్లీడింగ్ ఆగటానికి సుమారు వెయ్యి రూపాయలయ్యే ఇంజక్షన్ ఎదో  చేసింది.

 ఇంటికి వస్తూనే వాళ్ళ అమ్మకి మెసేజ్ ఇచ్చి పిలిపించి, డాక్టర్ బ్లీడింగ్ అయితే అవయవలోపంతో పిల్లలు పుడతారని చెప్పింది అనే మాట దాచి పెట్టి, మా అత్తా,మొగుడు,ఆడపడుచు అందరూ నన్ను మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని అబార్షన్ చేపించుకోమంటున్నారు నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకుపో అంటూ అమ్మతో కలిసి పెద్ద గొడవ చేసి,నా బిడ్డని చంపమంటారా ?? నేను ఒప్పుకోను నేను ఏమి చేసినా నా పిల్లల్ని పోషించుకుంటాను అని భర్త తో గొడవపడిం వెంటనే భర్తకు గానీ అత్తా,మామలకు గానీ చెప్పకుండా తల్లితో కలిసి వీళ్ళందరినీ ఇష్టమొచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా చేసేదేమీ లేక ఊర్కున్నారు..తర్వాత కొంతకాలానికి ఆ భార్య నా భర్త,అత్తా,ఆడపడుచులు నాకు పిల్లలు పుట్టటం ఇష్టం లేక,ఆడపిల్ల పుడుతుందని అబార్షన్ చేయించుకోమని నన్ను బలవంతం చేశారు, నన్ను నా బిడ్డని చంపబోయారు అందుకే నేను మా అమ్మా వాళ్ళింటికి వెళ్లాను.. అంటూ 498a లు,ఇంకా ఏవో అభియోగాలు భర్త మీద మోఫై పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పింది.

ఇప్పుడు భర్త ( తండ్రి) వాదన :
ఒక్క నెలకే నాకు ఆడపిల్ల అని ఎలా తెలుస్తుంది?? భార్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే,డాక్టర్ బ్లీడింగ్ అయితే అవయవలోపంతో  పిల్లలు పుడతారని చెప్పింది కాబట్టి ఆ మాట వచ్చింది కానీ లేకపోతె అబార్షన్ అన్న ఆలోచనే మాకు లేదు.చట్టాన్ని అడ్డు పెట్టుకుని మా కుటుంబాన్ని  హింసిస్తుంది.ఆమె మాటల్లో నిజం లేదు.నా భార్యకి ప్రెగ్నెన్సీ రావటం నాకు ఇష్టం లేకపోతె బ్లీడింగ్ అవుతుందని చేప్పిన  వెంటనే నిర్లక్ష్యం చెయ్యకుండా హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్ళేవాడిని? డాక్టర్ చెప్పిన ఇంజక్షన్ కూడా చేయించాను కదా? ఆ ఇంజెక్షన్ చేయించకపోతే అదే ఎదో అవుతుందిలే అని ఊరుకునే వాడిని కదా? ప్రెగ్నెన్సీ వచ్చాక బ్లీడింగ్ అయితే పిల్లలు  అవయవలోపంతో పుడతారన్న డాక్టర్ మాట నిజం కాదా? ఆ కారణంతో ఇప్పటివరకు ఏ మహిళా అబార్షన్ చేయించుకోలేదా?డాక్టర్ చెప్పిన మాటని మేమేదో ఆమెతో చెప్పించామని నింద  వేసి,ఆడపిల్ల అని వద్దన్నారని కధలు సృష్టించి,అందరినీ బజారుకీడ్చి గొడవ చెయ్యటం న్యాయమా ? చట్టంలోని లొసుగుల కారణంగా చట్టం ఇలాంటి మోసగాళ్లకు అండగా ఉంటె ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి?


నిజమే కదా ఎవరు ఏ దృష్టి తో చూస్తే ఆ దృష్టి తోనే లోకం కనిపిస్తుందంటారు ... ఈ ప్రపంచం లో నిజంగానే భార్యలను ఇబ్బంది పెట్టే వాళ్ళు, 8 సార్లు,10 సార్లు అబార్షన్స్ చేయించే వాళ్ళు ఉండొచ్చు... కానీ వీటినే సాకుగా చూపించి, ఏ తప్పు చేయని భర్తల్ని అత్తింటి వాళ్ళని నా ఇష్టం నాది,ఆ ఇష్టానికి అడ్డు తగిలితే ... నీ మీద కేస్ లు పెట్టి ఇరికిస్తాను అనే భార్యలను ఏమి చేయాలి ??? ఇలాంటి చట్టాలు ఇలాంటి చట్టాలు ఎవరు బాధితులో , ఎవరు నేరస్తులో  సరిగ్గా కనిపెట్టటం ఎలా?అన్నది ఇప్పుడు కొందరు బాధిత భర్తల ప్రశ్న...ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి ?? మీరైతే ఈ సమస్యని ఏ కోణం నుండి ఆలోచిస్తారు ??? ఎలా పరిష్కరిస్తారు,ఎవరిది తప్పు అంటారు?? మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియ చేస్తారని ఆశిస్తాను...


Related Posts Plugin for WordPress, Blogger...