30, అక్టోబర్ 2016, ఆదివారం
1, అక్టోబర్ 2016, శనివారం
శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవములు - 2016
అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం
ఈరోజు నుండి అమ్మవారి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి.విజయవాడ ఇంద్రకీలాద్రిమీద కొలువై, భక్తులకు కొంగుబంగారైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తులు అమ్మవారిని రోజుకో అలంకారంలో దర్శించుకుని తరిస్తారు.మేము చిన్నప్పటినుండి విజయవాడలో మా పెద్దమ్మ ఉండటంతో సెలవల్లో తప్పకుండా వెళ్ళేవాళ్ళము.వెళ్ళినప్పుడల్లా కుదిరినప్పుడు మా పెద్దమ్మ మమ్మల్ని గుడికి తీసుకెళ్లేది.అలా ఆ అమ్మ దుర్గమ్మతో మా అనుబంధం చిన్నప్పటినుండీ ఉంది.ఇక నేను డిగ్రీ, Law విజయవాడలోనే చదవటంతో వీలైనప్పుడు, ఖచ్చితంగా final exams అప్పుడు అమ్మని దర్శించుకొని వచ్చేదాన్ని. ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారైనా అమ్మని చూడాలనిపిస్తూ ఉంటుంది.ఈ సంవత్సరం విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మ ఆలయ విశేషాలు నా చిన్నిప్రపంచంలో..
శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రపురాణము
అప్పటినుండి ఇప్పటిదాకా అమ్మ ఆలయం
తెప్పోత్సవం
దసరా నవరాత్రుల పూజా విశేషాలు
చండ ముండాది శుంభ నిశుంభులను
రాక్షసులను సంహరించిన దానవు
ధూమ్రలోచనుని వధించిన దానవు
మహిషాసుర మర్ధన సమయంలో ఎర్రనైన కన్నులు కలదానవు
నిత్యమైన దానవు పాపాలను పోగెట్టేదానవు
అయిన ఓ తల్లీ ! నీకు నమస్కారం
జగన్మాత,జగద్విజేత,శక్తి స్వరూపిణి అయిన విశ్వజనని
దివ్యాశీస్సులతో, కరుణాకటాక్ష వీక్షణాలతో
ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ
శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవముల శుభాకాంక్షలు
రాక్షసులను సంహరించిన దానవు
ధూమ్రలోచనుని వధించిన దానవు
మహిషాసుర మర్ధన సమయంలో ఎర్రనైన కన్నులు కలదానవు
నిత్యమైన దానవు పాపాలను పోగెట్టేదానవు
అయిన ఓ తల్లీ ! నీకు నమస్కారం
జగన్మాత,జగద్విజేత,శక్తి స్వరూపిణి అయిన విశ్వజనని
దివ్యాశీస్సులతో, కరుణాకటాక్ష వీక్షణాలతో
ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ
శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవముల శుభాకాంక్షలు
లేబుళ్లు:
శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవములు - 2016