పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

8, మార్చి 2010, సోమవారం

అమ్మ


యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవత
ఎక్కడైతే స్త్ర్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు.

కల
తానై అలరించేది మగువ
తనువు
తానై మురిపించేది మగువ
ఉలి
తానై మనిషినే మలిచేది మగువ
నింగినైనా
నేలనైన అముల్యమైనదీ మగువ
వెల
లేని నిధియే మగువ.

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు కాని కేవలం ఒక్క పురుషుడి వెనక మాత్రమే కాదు ప్రతిమనిషి విజయం,వ్యక్తిత్వం వెనక ఒక స్త్రీ తప్పకుండా వుంటుంది.
ఆమె తల్లి ,భార్య ,అక్క,చెల్లి ,స్నేహితురాలు ఎవరైనా కావచ్చు.

ఈ లోకం లో ప్రతి మహిళా ఆదర్శ మరియు పరిపూర్ణ మహిళే అని నా అభిప్రాయం.

నా మొదటి ఆదర్శ మహిళ మా అమ్మఎవరికైనా మొదటి గురువు అమ్మే అని నా అబిప్రాయం.

కుటుంబంలో అందరితో కలిసిపోయి అందరి బరువు,భాధ్యతలను సంతోషంగా స్వీకరించే అమ్మ,

ఇంట్లో ఎవరినీ బాధించకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించగలిగే అమ్మ తెలివి అభినందనీయం.

నేను ఎప్పుడైనా చలి ఎక్కువగా ఉందమ్మా అంటే చాలు నువ్వు డిసెంబర్ లో పుట్టావు అందుకే నీకు చలి ఎక్కువ,అప్పట్లో నిన్ను చలి నుంచి కాపాడటానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ ఆనందంగా చెప్పే అమ్మని చూస్తే చిన్నతనం ఇంకా నా కళ్ళ ముందు ఉన్నట్లే వుంటుంది.

చిన్నప్పుడు నువ్వు సన్నగా వుండేదానివి అందుకే నిన్నుఎత్తుకుని తమ్ముడిని నడిపించేదాన్ని
అని అమ్మ చెప్తే ఆనందంగా అనిపిస్తుంది..

అమ్మ నన్ను రెడీ చేసే విధానం,నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి నన్ను అనుకరించాలని చూసే
మా బంధువుల పిల్లల్ని,నా స్నేహితులని చూసి నా గొప్పతనానికి గర్వపడేదాన్ని.

చదువు విషయం లో కూడా మా బంధువులు నా కంటే చిన్నపిల్లలకి అక్క చూడు ఎలా చదువుతుందో అలా చదవాలి అని వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించే విధంగా అమ్మ నన్ను చదివించింది.

నా బి.ఎ అయిపొగానే అందరూ ఆడపిల్ల కదా బి.ఎడ్ చదివించమని సలహా ఇచ్చారు కాని అమ్మ నన్ను ''లా'' చదివిస్తానని పట్టుపట్టింది.నేను లా చదివి జడ్జ్ కావాలన్నది అమ్మ కోరిక.

నన్ను లా లో జాయిన్ చేయడానికి అమ్మ, చేసిన ప్రయత్నం నేను ఎప్పటికి మరిచిపోలేను.
లాసెట్ లొ నాకు మంచి రాంక్ తో విజయవాడ సిద్ధర్థా లా కాలేజ్ లొ సీట్ వచ్చింది.

నేను చదువుకునే రోజుల్లో అమ్మ నాకు వారానికి ఒక వుత్తరం రాసేది.నన్ను బాగా చదవమని,
భయపడొద్దని నేను చదవాల్సిన అవసరాన్ని నాకు గుర్తు చెసేది.

అమ్మ నన్ను కోరిన కోరిక నేను బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని, నేను జడ్జ్ కావాలన్నది.

అమ్మ కోరికలో బాగా చదవాలనే మొదటి కోరిక తీర్చగాలిగాను లా మూడు సంవత్సరాలు అమ్మాయిలలో నేనే మంచి మార్కులు తెచ్చుకుని బెస్ట్ అవుట్ గోయింగ్ ఫిమేల్ స్టూడెంట్ గా గోల్డ్ మెడల్ సాధించటం నా జీవితం లొ మరచిపోలేని మధురానుభూతి.

గోల్ద్ మెడల్ తీసుకునే రోజు నా కుటుంబం,నా స్నేహితులు అందరు నాతో వున్నారు.
నా వాళ్ల ముందు నాకు దక్కిన ఈ అరుదైన గౌరవానికి స్ఫూర్తి మా అమ్మ.

నేను జడ్జ్ కావాలన్న అమ్మ కోరిక ఇంకా తీర్చలేకపోయాను.
కానీ అవకాశం వున్నంత వరకు అమ్మ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను.

ఇలా పిల్లల్ని వ్యక్తిత్వంతో,ధైర్యంగా ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొని విజయం సాధించగల విజేతలుగా నిలపగలఅమ్మ కంటే రోల్ మోడల్ ఇంకెవరైనా ఉంటారా?
అందుకే అమ్మకి జే జే.

ఒక్క మా అమ్మకే కాదు అమ్మలందరికీ,మహిళామణులకి
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.


Related Posts Plugin for WordPress, Blogger...