పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, మే 2010, ఆదివారం

అమ్మ అన్నది ఒక కమ్మని మాట


అమృతానికి అర్పణకీ ఆది పేరు అమ్మ
ఆలయాన
దేవుని ప్రతిరూపం అమ్మ

ఇలలో
స్వర్గాన్ని సృష్టించేది అమ్మ

లోకం గుడి చేరగ తొలి వాకిలి అమ్మ...

అమ్మ లేని ప్రపంచం లేదు.అలాగే నా చిన్ని ప్రపంచంలో నా బంధువు, నా స్నేహితురాలు,నా గురువు అన్నీ ముందుగా అమ్మే.
ఎప్పుడు నా వెంట వుంటూ ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అమ్మ

చిన్నప్పటినుండి నా డ్రెస్ డిజైనర్ కూడా అమ్మే.తనే సొంతగా నా డ్రెస్లు డిజైన్ చేసి కుట్టేది.
ఫాబ్రిక్ పైంట్ చేసేది.ఆ డ్రెస్ లు బాగున్నాయని నా ఫ్రెండ్స్ మెచ్చుకుంటే చాలా గర్వంగా వుండేది.
ఇది మా అమ్మ కుట్టింది అని గొప్పగా చెప్పేదాన్ని.

ప్రతి విషయంలో అమ్మ సలహా నాకు తప్పనిసరి.

మనం చేసినా చేయకపోయినా అన్ని పనులు నేర్చుకుని వదిలేయాలి అని చెప్పేది మా అమ్మ.
అప్పుడు అమ్మ అట్లా నేర్పింది కాబట్టే ఇప్పుడు నేను అన్ని పనులు ఎవరి సహాయం లేకపోయినా చేసుకోగలుగుతున్నాను అనుకుంటాను.

నా హాబీలలో మంచి పాటలు వినడం,పుస్తకాలు చదవటం,పూజలు చేసుకోవటం,
ఇల్లు అందంగా సర్దటం ఇలాంటివన్నీ అమ్మ నుండి నేను నేర్చుకున్నవే.

నాకు,మా తమ్ముడికి,చెల్లికి మీరు ఎప్పుడు ఒకరిని ఒకరు వదిలి పోకూడదు, కలిసి వుండాలి.
ఒకరి పై ఒకరు ప్రేమగా వుండాలి అని చెప్తూ వుంటుంది మా అమ్మ.
మా మధ్య వున్న ప్రేమాభిమానాలకు మూలం మా అమ్మ.

పిల్లల క్షేమాన్ని కోరుకుని వాళ్ళ అభివృద్ధికి పాటుపడే అమ్మ దీవెనే మనకి శ్రీరామరక్ష.

మన కోసం అహర్నిశలు శ్రమించే అమ్మకి మనం ఇచ్చే బహుమతి మన ప్రేమ ఒక్కటే.
మన అవసరాలను తీర్చి మనల్ని మనిషిగా తీర్చిదిద్దిన అమ్మకి ఆమె అవసరంలో మనం ఉన్నామన్న ధైర్యాన్ని కలిగించాలి.
నా కోసం నా పిల్లలు ఏదైనా చేయగలరు అని అమ్మ అనుకునేలా చేయగలగాలి.
చిన్నప్పుడు సలహాలుగా అనిపించిన అమ్మ మాటలు పెద్దయ్యాక చాదస్తంగా అనిపించకూడదు.

మన కోరికలు తీర్చిన అమ్మకి కూడా కోరికలు వుంటాయి వాటిని తీర్చాల్సిన బాధ్యత పిల్లలది.
మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న అమ్మని మనం కూడా అలాగే చూడాల్సి వచ్చిన రోజున అమ్మని నిర్లక్ష్యం చేయకపోవటం మనం అమ్మకి ఇచ్చే గొప్ప బహుమతి.

మా అమ్మ కోరికలను,ఆశయాలను తీర్చగలిగే శక్తిని,అమ్మని ఆనందంగా ఉండేలా చేయగలిగే పరిస్తితులను భగవంతుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ

అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.


నేను వర్షంలో తడిచి ఇంటికి వచ్చినప్పుడు
గొడుగు తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు తమ్ముడు
వర్షం ఆగిన తర్వాత రావచ్చు కదా అని సలహా ఇచ్చింది చెల్లి
జలుబు చేస్తే గానీ అప్పుడు తెలుస్తుంది నీకు ఇది నాన్న బెదిరింపు
కానీ
నా తల తుడుస్తూ అమ్మ అంది ఈ వెధవ వర్షం ఇప్పుడే రావాలా
నువ్వు ఇంటికొచ్చేదాకా ఆగొచ్చు కదా... అని.
అమ్మ ప్రేమ అంటే ఇదే కదా..

అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అమ్మకు శుభాకాంక్షలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్సండీ చిలమకూరు విజయమోహన్ గారూ.
మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు.

Related Posts Plugin for WordPress, Blogger...