మావిచిగురుతిని మీకు శుభమని మేలుకోలిపెను గండుకోయిలా..
మంచికబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల..
ఇంతలో కల పండగా ఇంటిలో తొలిపండుగా..
నా చిన్నారి మేనకోడలికి , నా చిన్ని ప్రపంచానికి హృదయపూర్వక స్వాగతం...
ఇప్పటిదాకా కొడుకుగా,తమ్ముడిగా, అన్నగా వున్న నా తమ్ముడు వంశీ ఈ రోజు తండ్రి అయ్యాడు.
ఈ రోజు నా చిన్ని ప్రపంచంలోకి అడుగుపెట్టి ,నన్ను మేనత్తని చేసిన నా చిన్నారి మేనకోడలిని
నిండు మనసుతో దీవిస్తూ , మనసారా నా చిన్ని ప్రపంచానికి స్వాగతిస్తున్నాను...
కొత్త బంధాలను,కొత్త కొత్త సంతోషాలను నా చిన్ని ప్రపంచానికి తీసుకువచ్చిన మా చిన్నారి ఆటపాటల తో మా చిన్ని ప్రపంచం ఇంకా అందంగా,ఆనందంగా వుండాలని,
నా మేనకోడలికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను,సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని,
పాపాయి బోసినవ్వులతో,అల్లరితో మా చిన్నిప్రపంచం కళకళలాడాలని ...
నా చిన్ని ప్రపంచం ఎప్పుడూ భగవంతుడి చేతుల్లో పదిలంగా వుండాలని కోరుకుంటూ..
నా చిన్ని ప్రపంచంలోని అందరి దీవెనల జల్లులతో మా చిన్ని ప్రపంచానికి స్వాగతం చిన్నారీ...
రాజి
5 కామెంట్లు:
మేనత్తగారికి అభినందనలు .
బుజ్జి పాపాయికి స్వాగతం .
ధన్యవాదాలు మాలాకుమార్ గారూ
నా తరపున బుజ్జిపాపాయి తరపున కూడా..
బావుంది మీ రివ్యూ. ఇంకా చూడలేదు. ఇంట్లో ఎవరూ లేక బోరింగు గా వుంది కాబట్టి ఈ సినిమా చూడొచ్చేమో.
బుజ్జాయి ఫోటో పెట్టివుంటే మేమూ చూసేవారం కదా :)
శరత్ 'కాలమ్' గారూ థాంక్సండీ.. బుజ్జాయి ఫొటొ త్వరలోనె పెడతాను..:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి