
ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా,తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడకపోయినా ఇది గీసింది,తీసింది బాపూ అని గుర్తించగలిగే శైలి ఈయన సొంతం.
బాపూ అచ్చతెలుగు సినిమాలు సాధారణ కుటుంబాలలోని సమస్యలు,భార్యాభర్తల అన్యోన్యత, కుటుంబసభ్యుల మధ్యసంబంధాలను,ఎంతో చక్కగా ప్రతిబింబిస్తాయి.
బాపు సినిమాల్లో మరొక ముఖ్యమైన అంశం కధానాయిక.ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన,తెలుగు సంప్రదాయం ఉట్టిపడే నాయిక బాపు సినిమాల్లో ప్రధాన ఆకర్షణ.
అందంగా వున్న అమ్మాయిని ఎవర్ని చూసినా బాపుబొమ్మతో పోల్చటం బాపుబొమ్మ గొప్పతనం.
బాపు గురించి ఆరుద్ర గారు రాసిన కవిత...
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
బాపు సినిమాల్లోని కొందరు బాపుబొమ్మలు నాకు చాలా ఇష్టం..
ముత్యాలముగ్గు ...సంగీత.

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ...
గూటిపడవలో వున్నది కొత్త పెళ్ళికూతురు
ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే వయ్యారం
ముడుచుకునే కొలదీ మరీ మిడిసిపడే సింగారం...
మిష్టర్ పెళ్ళాం...ఆమని

సొగసు చూడతరమా..నీ సొగసు చూడతరమా
నీ సొగసు చూడతరమా...
నీ ఆపసోపాలు..నీ తీపిశాపాలు
ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుమా..
సొగసు చూడతరమా...నీ సొగసు చూడతరమా...
పెళ్ళిపుస్తకం...దివ్యవాణి.
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
బాపు సినిమాల్లోని కొందరు బాపుబొమ్మలు నాకు చాలా ఇష్టం..
ముత్యాలముగ్గు ...సంగీత.

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ...
గూటిపడవలో వున్నది కొత్త పెళ్ళికూతురు
ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే వయ్యారం
ముడుచుకునే కొలదీ మరీ మిడిసిపడే సింగారం...
మిష్టర్ పెళ్ళాం...ఆమని
సొగసు చూడతరమా..నీ సొగసు చూడతరమా
నీ సొగసు చూడతరమా...
నీ ఆపసోపాలు..నీ తీపిశాపాలు
ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుమా..
సొగసు చూడతరమా...నీ సొగసు చూడతరమా...
పెళ్ళిపుస్తకం...దివ్యవాణి.
4 కామెంట్లు:
Excellent selection.
harephala garu..
Thankyou verymuch..
చాల బాగున్నాయి రాజీ. బాపు అంటే నాకు చాలా ఇష్టం.
జయ గారూ ధన్యవాదాలండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి