10, మే 2011, మంగళవారం
తాటి ముంజలు --- సమ్మర్ ట్రీట్...
సమ్మర్ లో మాత్రమే దొరికే వాటిలో మాకు ఇష్టమైనవి తాటి ముంజలు..
తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు మీదపడకుండా తినటం ఒక సరదా..
ఈ సారి మా సమ్మర్ స్పెషల్ ట్రీట్ గా మా మరిదిగారు ( భద్ర ) తాటి ముంజలు తెచ్చారు.
వాళ్ళ వూరి దగ్గర చాలా తాటి చెట్లు ఉంటాయట..
మాకు ఇక్కడ మంచివి దొరకవని ప్రత్యేకంగా అక్కడి వాళ్ళతో
అప్పటికప్పుడు కొట్టించి,తంగేడు ఆకులతో భద్రపరచి జాగ్రత్తగా తీసుకువచ్చారు..
ఎప్పుడూ బజార్లో దొరికే తాటి ముంజలు బాగున్నా,బాగుండక పోయినా తినాలన్న ఇష్టంతో తినే మాకు
అప్పటికప్పుడు ఫ్రెష్ గా, లేతగా, మెత్తటి గుజ్జుతో వున్న తాటి ముంజలు చాలా నచ్చాయి.
ఈ సమ్మర్ లో ఇది నిజమైన సమ్మర్ స్పెషల్...
లేబుళ్లు:
Summer Specials...
8 కామెంట్లు:
దేశానికి దూరంగా ఉన్న మాలాంటి వారిని ఊరించటం పాపం...ఘోరం....దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా....:)
అయ్యో అచంగ గారు అయితే నేను మిమ్మల్ని బాధ పెట్టానన్నమాట..మన దేశాన్ని గుర్తు చేసి... :)
చాలా బాగున్నాయి, ఎపుడో చిన్నపుడు తిన్నాం ఇవి.
థాంక్యూ శ్రీ గారు..
మేము కూడా ప్రతిసంవత్సరం తక్కువే తింటాము.
ఈ సంవత్సరమే కొంచెం ఎక్కువగా తినే అవకాశం కలిగింది...
మొన్నీమద్య శేషాద్రి ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ లో పదికి ఆరు చొప్పున అమ్మడు ఒకడు. కొని ఫ్రిట్జ్ లో పెట్టి తిన్నాను. చాలా బావున్నాయి.
సాధారణ పౌరుడు గారు మీ తాటిముంజల జ్ఞాపకాలు బాగున్నాయండీ ..
Thanks for responding
బాగున్నాయి మీ ముంజల కబుర్లు. అసలు ఎండాకాలం ఈ ముంజల కోసమే నేను ఎదురు చూస్తా. మొన్నే ఈ ముంజల గురించి నేనూ ఓ టపా వ్రాసా చూడండి.
http://vareesh.blogspot.com/2011/05/blog-post.html
థాంక్యూ సిరిసిరిమువ్వ గారు.
మీ బ్లాగ్ చూశానండీ ...
మీ వూరి కబుర్లతో పాటు మీ తాటిముంజల ముచ్చట్లు,మీ వాళ్ళందరి ఫోటోస్ అన్నీ చాలా బాగున్నాయి.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి