పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, ఆగస్టు 2011, గురువారం

కరుణశ్రీ పుష్పవిలాపం...

"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి
రోజు కరుణశ్రీ గారి 99 జయంతి.గుంటూరు జిల్లా కొప్పర్రులో 1912 ఆగస్ట్ 4 జన్మించిన
జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించారు..
కవిగా,పండితునిగా విమర్శకునిగా,వ్యాఖ్యాతగా,సంపాదకునిగా,వుపన్యాసకునిగా
వెలుగొందిన ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి .
అందమైన పూలను గురించి కవితలు అందరూ చెప్తారు కానీ పూలకి కూడా ప్రాణం వుందని,
పూల మనసులో మనషుల గురించిన ఆలోచనలను,ఆ
పూల గుండెలోని బాధను హృద్యంగా
"పుష్పవిలాపం" గా వర్ణించటం కరుణశ్రీకే సాధ్యం..



కరుణశ్రీ పుష్పవిలాపం




నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ
ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కళకళలాడుఉంది పూల బాలలు తల్లి ఒడిలో
అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు

నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగనోళ్ళు విప్పి
మా ప్రాణము తీతువాయనుచుబావురుమన్నవి కృంగిపోతి
నామానసమందేదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని
గొంతుకతో నన్ను చూసి యిలా అన్నది ప్రభు ...

ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము
తదీయ కరమ్ములలోన స్వేచ్చ్చమై ఊయల లూగుచున్
మురియుచుందుము...ఆయువు తీరినంతనే
హాయిగ కన్ను మూసెదము...ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు
మేము నీకేం అపకారము చేసాము

గాలిని గౌరవింతుము సుగంధము పూసి
సమాశ్రయించు భ్రుంగాలకు విందు చేసెదముకమ్మని తేనెలు
మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రులు మమ్ముల
స్వార్ధబుద్ధితో తాలుము...త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే

యింతలో ఒక గులాబి బాల కోపంతో
మొహమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
ఊలు దారాలతో గొంతుకురి బిగించి...
గుండెలోనుండిసూదులు గుచ్చి కూర్చి...
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట దయలేనివారు మీ యాడువారు
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల
మీకయి త్యహించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా

వోయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమంగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి
గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను
ప్రసరింపుము ప్రభు .... ప్రభూ.....


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలారోజులయింది విని .
చదివినప్పుడుకంటే వింటుంటే మరీ బాధగా వుంటుంది. ఆ స్వరంలొ కరుణ పొంగి పొరలుతుంటుంది .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

అవును లలిత గారు మధుర గాయకుడు ఘంటసాలగారి స్వరంలొ ఈ కావ్యం వినటానికి చాలా బాగుంది...
స్పందించినందుకు ధన్యవాదములు..

Related Posts Plugin for WordPress, Blogger...