పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

29, ఆగస్టు 2011, సోమవారం

ఉరుమి - THE WEAPON

ఈ మధ్య చూసిన సినిమాల్లో నాకు చాలా నచ్చిన సినిమా "ఉరుమి". భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న గొప్ప వ్యక్తిగా తెలిసిన వాస్కోడిగామా మరో రూపాన్ని పరిచయం చేసిన సినిమా ఉరుమి.

పుట్టిన భూమి మీద దేశభక్తీ,అభిమానం లాంటి ఫీలింగ్స్ లేని ఒక యువకుడు తన పూర్వీకుల భూమిని ఒక విదేశీ మైనింగ్ కంపెనీకి అమ్మాలనే ఆలోచనతో ఇండియా రావటంతో కధ మొదలవుతుంది.పదిహేనో శతాభ్దంలో కేరళలో వాస్కోడిగామా దుర్మార్గానికి బలైన కొత్వాల్ ఆర్య కొడుకు కేలు ( పృద్విరాజ్) వాస్కోడిగామను అంతం చేయాలన్న పట్టుదలతో తమ జాతివారు తమ ప్రాణాలను కాపాడుకోవటం కోసం సేకరించిన బంగారంతో ఉరిమి అనే ఆయుధాన్ని తయారుచేసుకుని చిరక్కల్ రాజు ఆస్థానంలో చేరి, ఆటవికులకు యుద్ధవిద్యలు నేర్పి వారి సహకారంతో చివరికి వాస్కోడిగామాను అంతం చేయటం సినిమా కధ క్లుప్తంగా...

ఒకప్పుడు విదేశీయుల ఆక్రమణల నుండి మన భూమిని తప్పించటానికి మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు
అలాంటి వీరుల వారసులుగా మనం మళ్ళీ మన భూమిని వివిధ కారణాలు చెప్పుకుని విదేశీయులకి అప్పగించటం సమంజసమేనా అన్న ప్రశ్నతో మొదలైన ఈ సినిమా ఆలోచింపచేస్తుంది..

స్వాతంత్ర్యోద్యమం అంటే గాంధీ,నెహ్రు,భగత్ సింగ్ లాంటి నాయకులు మాత్రమే సామాన్యంగా గుర్తుకు వస్తారు కానీ
ఎటువంటి విద్య,విజ్ఞానం లేని ఎంతో మంది అనాగరికులకు నాయకత్వం వహించి విదేశీయులను ఎదిరించిన పోరాడిన వీరులు ఎందరో వున్నారని ఈ సినిమా గుర్తు చేసింది.ఈ సినిమా చూస్తే నాకు అల్లూరి సీతారామరాజు, ఇంకా మా పల్నాడులో ప్రసిద్ధి చెందిన కన్నెగంటి హనుమంతు లాంటి వీరులు గుర్తుకు వచ్చారు.ఎందరో ఇలాంటి వీరుల పోరాటాల ఫలితమే కదా మన స్వాతంత్ర్యం అనిపించింది.

కొత్వాల్ గా ఆర్య యాక్షన్ బాగుంది.హీరో పృథ్విరాజ్ యుద్ధవీరుడి పాత్ర కు చాలా చక్కగా సరిపోయాడు.మంచి నటనతో ఆకట్టుకున్నాడు.ఎక్స్ ప్రెషన్స్ ,యాక్షన్ సీన్స్ చాలా చక్కగా చేశాడు..ప్రభుదేవా హీరోకి మంచి స్నేహితుడి పాత్రలో నటించాడు.ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జెనీలియా గురించి ఎప్పుడు అల్లరిపిల్లలాగా నటించే జెనీలియా యుద్దవిద్యలో ఆరితేరి శత్రువులను ఎదిరించే చురుకైన యువరాణి పాత్రలో జెనీలియా నటన బాగుంది..


నిత్యామీనన్ చాలా ముద్దుగా ,అందంగా అమాయకమైన యువరాణి పాత్రలో బాగా నటించింది .
విద్యాబాలన్ ఆ రోజుల్లో కేలుకి మార్గదర్శకత్వం చేసిన యక్షిణిగా,ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ గా చేసిన గెస్ట్ రోల్ బాగుంది.



సంతోష్ శివన్ దర్శకత్వం,సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.కేరళ అందాలను,గ్రీనరీని చాలా చక్కగా చూపించారు.
ఎక్కడా డబ్బింగ్ సినిమా చూస్తున్నట్లుగా అనిపించలేదు..మొదటి నుండి చివరిదాకా అప్పటి పరిస్థితులను కళ్ళకి కట్టినట్లు చూపించారు...కొంతమంది అనుకున్నట్లు ఇది కేరళలో జరిగిన కధ కాబట్టి తెలుగు వాళ్లకి అంతగా నచ్చదు అనటంలో వాస్తవం లేదు ఎందుకంటే ప్రాంతం ఏదైనా అది మన భారతదేశంలో ఒక భాగమే కాబట్టి..
మొత్తానికి ఈ సినిమా డిగ్రీ కోసం హిస్టరీ చదివిన నాలాంటి ఎంతోమంది హిస్టరీ స్టూడెంట్స్ అందరు
తప్పకుండా తెలుసుకుని తీరవలసిన మన భారతదేశ చరిత్ర ఇంకా ఎంతో వుందని తెలియచేస్తుంది .

కదనం కదనం జీవిత పయనం



 

8 వ్యాఖ్యలు:

ఎందుకో ఏమో ? చెప్పారు...

ఏ కార్యానికి ఏది కారణమో
ఏ కర్మకు ఏది ప్రేరనో గానీ
మీ వ్యాఖ్యానం నాచేత సినిమా చూసే లా చేసింది
thanks
విత్ ఇన్ అ వీక్ ఐ విల్ Watch this movie

రాజి చెప్పారు...

ఎందుకో ఏమో ? గారు
వురుమి సినిమా తప్పకుండా చూడండి ..
చాలా బాగుంది.
నా వ్యాఖ్యానం మీకు నచ్చినందుకు
Many Thanks...

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

హలో అండి, with in a week అన్నానా ?
sorry movie తెచ్చుకున్నాను కాని చూద్దామని delay చేసి మర్చి పోయి నిన్న night చూసాను really awesome ,
thanks for suggesting me to watch this అపురూపం
నన్ను నేను చూసుకో గలిగాను అంత కన్నా ఏమి చెప్పలేను
bye bye

?!

రాజి చెప్పారు...

హాయ్ అండీ శివ గారూ బాగున్నారా??
ఐతే మొత్తానికి ఉరిమి సినిమా చూశారన్నమాట.
సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ThankYou..

రసజ్ఞ చెప్పారు...

అసలు హిస్టరీ అంటే ఇష్టం లేని నేను కూడా ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సంతోష్ శివన్, జెనీలియా, పృథ్విరాజ్ కోసం మలయాళంలో చూసాను. చాలా బాగుంటుంది. జెనీలియా చాలా వైవిద్యభరితంగా చేసింది. చక్కగా చెప్పారండీ! ఈ సినిమాలో నాకు తెలిసిన క్రొత్త విషయం పోర్టుగీస్ కూడా స్పానిష్లానే ఉంటుంది అని! కనుక అది కూడా అర్థం అయ్యింది;)

రాజి చెప్పారు...

రసజ్ఞ గారు ..
మీరు ఈ సినిమా మళయాళం లో చూశారనమాట.
నేను మాత్రం హిస్టరీ అంటే ఆసక్తి కాబట్టే ఈ సినిమా చూశానండీ..
సినిమా గురించి మీ అభిప్రాయాలు చెప్పినందుకు,
నేను చెప్పింది నచ్చినందుకు థాంక్సండీ..

Dantuluri Kishore Varma చెప్పారు...

మీ రైటప్ చాలా బాగుంది రాజీగారు. చదువుతూ ఉండగానే యూట్యూబ్‌లో ఉరుమి మూవీ చూడడం మొదలుపెట్టాను. ఇంటరెస్టింగ్‌గా ఉంది. పూర్తిగా చూస్తాను. థాంక్స్!

రాజ్యలక్ష్మి చెప్పారు...

"Dantuluri Kishore Varma" గారూ..
సినిమా గురించి నేను రాసింది నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థ్యాంక్సండీ ..

Related Posts Plugin for WordPress, Blogger...