పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, అక్టోబర్ 2011, సోమవారం

ఏ నావదేతీరమో ... ఏ నేస్తమేజన్మవరమో
నాకు చాలా ఇష్టమైన పాట .
ఇద్దరు ప్రేమికులు విడిపోయిన సమయంలో పాడుకునే ఈ పాట హృదయాన్ని ఏదో తెలియని  బాధకు గురిచేస్తుంది. 
"ఏ నావదేతీరమో నేస్తమే జన్మవరమో" నిజమే కదా...!

నావదేతీరమో నేస్తమేజన్మవరమో
నావదేతీరమో నేస్తమేజన్మవరమో
కలగానో కధగానో... మిగిలేదీ నీవే జన్మలో
నావదేతీరమో నేస్తమేజన్మవరమో 

నాలోని నీవే నేనైనాను 
నీలోని నేనే నీవైనాను 
 నాలోని నీవే నేనైనాను 
నీలోని నేనే నీవైనాను

విన్నావా ఈ వింతను...అన్నారా ఎవరైనను
 
విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను...


ఆకాశమల్లె నీవున్నావు... 

నీ నీలిరంగై నేనున్నాను 
ఆకాశమల్లె నీవున్నావు 
నీ నీలిరంగై నేనున్నాను 

కలిసేది ఊహేనను ... ఊహల్లో కలిశామను 
కలిసేది ఊహేనను ఊహల్లో కలిశామను
నీవు నేనే సాక్ష్యాలను..
 

నావదేతీరమో నేస్తమేజన్మవరమో
 నావదేతీరమో నేస్తమేజన్మవరమో 
కలగానో కధగానో మిగిలేదీ నీవే జన్మలో

నావదేతీరమో నేస్తమేజన్మవరమో
 నావదేతీరమో నేస్తమేజన్మవరమోసినిమా:సంకీర్తన
సంగీతం:ఇళయరాజా
లిరిక్స్:ఆత్రేయ
గానం - j . ఏసుదాస్

2 వ్యాఖ్యలు:

ఎందుకో ఏమో ? చెప్పారు...

ఎంత గానో అభిమానించి ఆస్వాదించి
అనుకోని మత్తులో ఆదమరచి నిదురించి
మరచిన నా హృదయాన్ని నిడురలేపారు ఇలా
ధన్యవాదాలు
మేలు మరువలేను

రాజి చెప్పారు...

ఎందుకోఏమో? గారు
మీ చక్కని కామెంట్ కి ధన్యవాదములండీ

Related Posts Plugin for WordPress, Blogger...